Rugby Premier League | సీఎం రేవంత్‌తో కలిసి రగ్బీ ఫైనల్ వీక్షించిన చిరంజీవి.. హైదరాబాద్ హీరోస్‌కు ట్రోఫీ
Rugby Premier League | నిత్యం సినిమా షూటింగ్స్, సామాజిక సేవా కార్యక్రమాలతో బిజీగా ఉండే మెగాస్టార్ చిరంజీవి ఆదివారం సాయంత్రం కాస్త రిలాక్స్ అయ్యారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్పీఎల్) సీజన్-2 ఫైనల్‌కు ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
Rugby Premier League | నిత్యం సినిమా షూటింగ్స్, సామాజిక సేవా కార్యక్రమాలతో బిజీగా ఉండే మెగాస్టార్ చిరంజీవి ఆదివారం సాయంత్రం కాస్త రిలాక్స్ అయ్యారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్పీఎల్) సీజన్-2 ఫైనల్‌కు ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మ్యాచ్‌ను వీక్షించిన చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారం రోజులుగా ఉత్కంఠభరితంగా సాగిన ఈ టోర్నీలో హైదరాబాద్ హీరోస్ జట్టు అద్భుత ప్రదర్శనతో చాంపియన్‌గా అవతరించింది. గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన జట్టు ఈసారి పట్టుదలతో ఆడి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో హైదరాబాద్ హీరోస్ 41-17 తేడాతో ముంబై డ్రీమర్స్‌పై ఘన విజయం సాధించింది.
ఫైనల్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి విజేతలకు ట్రోఫీని అందజేశారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు రగ్బీ ఇండియా అధ్యక్షుడు, ప్రముఖ బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్ ఆటగాళ్లకు పతకాలు ప్రదానం చేశారు. కప్ గెలుచుకున్న హైదరాబాద్ హీరోస్ జట్టుకు రూ.45 లక్షల ప్రైజ్‌మనీ లభించగా, రన్నరప్ ముంబై డ్రీమర్స్‌కు రూ.25 లక్షలు అందజేశారు. మూడో స్థానంలో నిలిచిన బెంగళూరు బ్రేవ్ హార్ట్స్ జట్టుకు రూ.15 లక్షల నగదు బహుమతి లభించింది. ఇక మూడో స్థానం కోసం జరిగిన పోరులో బెంగళూరు బ్రేవ్ హార్ట్స్ జట్టు 22-19 తేడాతో చెన్నై బుల్స్‌పై విజయం సాధించి మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఈ మ్యాచ్ కూడా అభిమానులను ఉత్కంఠకు గురి చేసింది.
ఫైనల్ పోటీకి పలువురు ప్రముఖులు హాజరై ఆటగాళ్లను ప్రోత్సహించారు. స్టార్ షట్లర్ పీవీ సింధు, హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌తో పాటు పలువురు క్రీడా, సినీ ప్రముఖులు గచ్చిబౌలి స్టేడియంలో సందడి చేశారు. ముఖ్యంగా చిరంజీవి హాజరు కావడంతో అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు.క్రీడలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, సినీ ప్రముఖుల మద్దతు కలిసి రగ్బీ ప్రీమియర్ లీగ్‌కు మరింత గుర్తింపు తీసుకొచ్చాయని నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ జట్టు విజయం నగర క్రీడాభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

