టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న సినిమాల్లో ఒకటి సలార్ (Salaar). కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సలార్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ బీటౌన్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. అదేంటంటే విజయ్ దేవరకొండ (Vijay deverakonda) షూటింగ్లో భాగంగా ముంబైలో మెరిశాడు.
దీంతో ఈ క్రేజీ హీరో షూటింగ్లో పాల్గొంటున్న సినిమా మరేదో కాదు.. సలార్ సినిమాలో విజయ్ దేవరకొండ చిన్న పాత్రలో కనిపించబోతున్నాడని, అందుకే ముంబైలో ప్రత్యక్షమయ్యాడంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే విజయ్ టీం నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ న్యూస్ ఫేక్ అని, ఎలాంటి వాస్తవం లేదని టాక్. విజయ్ దేవరకొండ ఓ యాడ్ షూటింగ్లో భాగంగా ముంబైలో ఉన్నట్టు ఇన్సైడ్ టాక్.
కాగా విజయ్ దేవరకొండ టీం సమంతతో కలిసి నటిస్తున్న ఖుషీ చిత్రం కొత్త షెడ్యూల్ త్వరలో మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఖుషీ చిత్రంలో కన్నడ యాక్టర్ జయరాం, మురళీ శర్మ, సచిన్ ఖడేకర్, అలీ, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ , రోహిణి, లక్ష్మి,కీలక పాత్రలు పోషిస్తున్నారు. సమంత ఇటీవలే టైటిల్ రోల్ లో నటించిన యశోద బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.
Read Also : Bandla Ganesh | రాజకీయాలతో చాలా నష్టపోయా.. హాట్ టాపిక్‌గా బండ్ల గణేశ్ కామెంట్స్
Read Also :Boss Party making Video | వాల్తేరు వీరయ్య బాస్ పార్టీ సాంగ్ మేకింగ్ గ్లింప్స్ వీడియో
Read Also :Yashoda | యశోద సినిమా వివాదానికి లైన్ క్లియర్.. నిర్మాత క్లారిటీ