Spy Movie | నిఖిల్ స్పై మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ పై క్లారిటీ వచ్చేసింది..!
Nikhil | స్పై సినిమా పోస్ట్ పోన్ కానున్నట్లు రెండు, మూడు రోజులుగా వార్తలు వస్తున్నాయి. కాగా తాజాగా ఈ సినిమా రిలీజ్ పై క్లారిటీ వచ్చేసింది. యూఎస్ డిస్ట్రిబ్యూటర్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ ఈ సినిమా జూన్ 28న ప్రీమియర్ కానున్నట్లు తెలిపింది.
Nikhil | కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టిన పేరు యంగ్ హీరో నిఖిల్. ఆయన నుండి సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ అనే ట్యాగ్‌ను సంపాదించుకున్నాడు. ఇక ‘కార్తికేయ-2′ ఏకంగా పాన్ ఇండియా రేంజ్లో హిట్టు కొట్టి స్క్రిప్ట్ సెలక్షన్లో తను ఎంత మేటీ అనేది నిరూపించాడు. ఇక ఇటీవలే రిలీజైన ’18పేజీస్’ కాస్త నిరాశపరిచింది. అయితే నిఖిల్ ఉన్న ఫామ్‌లో ఈ ఒక్క ఫ్లాప్ తన మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదు. పైగా ఇది కూడా బ్రేక్ ఈవెన్ దగ్గరికి వచ్చి ఆగిపోయింది. ఇక ప్రస్తుతం నిఖిల్ చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ‘స్పై’ ఒకటి. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా పరిచయమవుతూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్లకు తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా పోస్ట్ పోన్ కానున్నట్లు రెండు, మూడు రోజులుగా వార్తలు వస్తున్నాయి. కాగా తాజాగా ఈ సినిమా రిలీజ్ పై క్లారిటీ వచ్చేసింది. యూఎస్ డిస్ట్రిబ్యూటర్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ ఈ సినిమా జూన్ 28న ప్రీమియర్ కానున్నట్లు తెలిపింది. 450కు పైగా లొకేషన్లలో సినిమా విడుదల కానుందని తెలిపింది. అంతేకాకుండా వచ్చే సోమవారం నుండి బుకింగ్స్ కూడా ఓపెన్ కానున్నట్లు తెలిపింది. దాంతో ఈ సినిమా విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని క్లారిటీ వచ్చేసింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను ఈడి ఎంటర్టైనమెంట్స్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి, చరణ్ తేజ్ ఉప్పలపాటిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిఖిల్‌కు జోడీగా సాన్య థాకూర్, ఐశ్వర్య మీనన్‌లు నటిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ సంగీతం స్వరపరుస్తున్నారు.
The countdown begins for a thrilling spy adventure! 🔥#SPY is set to make its USA premieres on June 28th, hitting 450+ locations across the nation ❤️🔥
Bookings open from MONDAY! 🎟️ #IndiasBestKeptSecret 🇮🇳
USA Release by @PrathyangiraUS @actor_Nikhil @Ishmenon @Garrybh88… pic.twitter.com/kYMdS4QP1B
— Prathyangira Cinemas (@PrathyangiraUS) June 12, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

