లోకల్లో ఉండడు.. హైదరాబాద్‌లోనూ దొరకడు..
‘నన్ను బెల్లంపల్లి ఎమ్మెల్యేగా గెలిపించండి.. గెలిచిన తెల్లారే ఇక్కడనే ముగ్గు పోసి ఇల్లు కడతా అన్నడు.. లోకల్లోనే అందుబాటులో ఉంటా అని మాటలు చెప్పిండు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడికి పోయినా ఇదే మాట చెప్పిండు.
- ప్రజాస్వామ్యం అంటే ఆ ఎమ్మెల్యేకు గౌరవమే లేదు
- రాష్ట్రంలో ఓటేయని ఏకైక ఎమ్మెల్యేగా రికార్డు
- గెలిపిస్తే స్థానికంగా ముగ్గుపోసి ఇల్లు కడుతా అన్న మాట ఏమైంది..
- ఎమ్మెల్యేపై పెదవి విరుస్తున్న బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు
మంచిర్యాల, మే 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘నన్ను బెల్లంపల్లి ఎమ్మెల్యేగా గెలిపించండి.. గెలిచిన తెల్లారే ఇక్కడనే ముగ్గు పోసి ఇల్లు కడతా అన్నడు.. లోకల్లోనే అందుబాటులో ఉంటా అని మాటలు చెప్పిండు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడికి పోయినా ఇదే మాట చెప్పిండు. పైగా ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు స్థానికంగానే ఉంటా అంటూ బాండ్ రిలీజ్ చేసిండు. గెలిచినంక ఆయింత అవతల పడ్డడు. ఆయన్నీ కలవాలంటే లోకల్లో ఉండడు.. పోనీ హైదరాబాద్‌లో సార్ ఇంటికి పోయినా దొరకడు’ అంటూ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్‌పై పెదవి విరుస్తున్నారు.
ముగ్గుపోసి ఇల్లు కట్టకపోయినా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లోనైనా ఉండొచ్చు కదా.. ఈ విషయం అడిగితే దానికి వాస్తు దోషం ఉందంటున్నడు. పోయి పోయి టూరిస్టు ఎమ్మెల్యేను గెలిపించుకున్నాం అంటూ వాపోతున్నారు. సార్ లోకల్‌కి వచ్చినా కలవాలంటే మంచిర్యాలకు పోవాల్సి వస్తుందని, అక్కడా దొర్కకపోతే ఐదారువేల రూపాయలు ఖర్చు పెట్టుకుని హైదరాబాద్‌కు పోవాల్సి వస్తుందంటున్నరు. స్థానికంగా నిత్యం ప్రజల్లో ఉండే పాత ఎమ్మెల్యేను వదులుకుని కాంగ్రెస్ హామీలకు ఆశపడి ఓట్లు వేస్తే ఇబ్బందులు తప్పడం లేదంటూ బాధలు చెప్పుకుంటున్న బెల్లంపల్లి జనాలు.
ప్రజాస్వామ్యంపై గౌరవం ఉండదా..
ఆయన ప్రజలచేత, ప్రజల కొరకు.. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే. అందరికంటే ముందు ఆయన ఓటేయాలి.. కానీ, బెల్లంపల్లి ఎమ్మెల్యే మాత్రం ఓటేయలేదు. తమ్ముడి కొడుకును ఓట్లేసి గెలిపించడంటూ ప్రచారం చేసిన పెద్ద మనిషి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటే వేయలేదు. ప్రజాస్వామ్యయుతంగా ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి.. ఓటేయకుండా ప్రజాస్వామ్యాన్ని ఏ మాత్రం గౌరవం ఇచ్చారనేది ఇప్పుడు బెల్లంపల్లిలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన గతంలోనూ స్థానికంగా అందుబాటులో లేని అంశాలను జనాలు లేవనెత్తుతున్నారు.
ఎన్నికలకు ముందు రంజాన్ తోఫాలు, ఇఫ్తార్ విందులంటూ తిరిగిన ఆయనే.. ఎమ్మెల్యేగా గెలిచినా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు అంటూ వీడియో సందేశం విడుదల చేశారంటూ మండిపడుతున్నారు. ముస్లిం మైనార్టీలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముస్లిం నాయకులే ఆయనపై గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే అవసరం ఉన్న ప్రతి సందర్భంలో ఆయన కనిపించడం లేదంటూ నియోజకవర్గ ప్రజలు కోడైకూస్తున్నారు.
ఈ ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో తప్పదని చెప్తున్నారు. ఆయనే నియోజకవర్గాన్ని పట్టుకుని ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో బ్రహ్మాండంగా పని చేసేవాళ్లని.. మరి ఆయనకు ఇష్టంలేదో ఏమో తమ్ముడి కొడుక్కి అంతగా సహకరించలేదని.. ఎమ్మెల్యే ఎన్నికల కోసం చేసినంత కసరత్తు చేయలేదని కాంగ్రెసోళ్లు బాహాటంగానే చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేకు వచ్చిన మెజార్టీ ఎంపీ అభ్యర్థి రాదని.. దానికి కారణం పెద్దసారు వ్యవహారశైలేననే గుసగుసలు వినిపిస్తున్నాయి. స్థానికత అంశం ఈ ఎన్నికల్లో నానుతుండడంతోనే ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు వాస్తు పేరుతో రిపేర్లు చేయిస్తున్నారని, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే లాభం ఏంటని చర్చించుకుంటున్నారు. మరీ సారు మీద జనం లోపల ఉన్న ఈ వ్యతిరేకత ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందా లేదా అనేది మరి కొన్ని రోజుల్లోనే తేలనుంది.
అక్రమ దందాల్లో కాంగ్రెసోళ్లు
ఎమ్మెల్యేతోపాటు స్థానిక కాంగ్రెస్ లీడర్ల వ్యవహారశైలి కూడా బెల్లంపల్లి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేపై ఉన్న కోపానికి అది మరింత ఆజ్యం పోసినట్లు తయారవుతున్నదని కిందిస్థాయి కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేసే వ్యవహారంలో బెల్లంపల్లికి చెందిన సీనియర్ కాంగ్రెస్ లీడర్లు ఉన్నారని చెప్తున్నారు. కొన్ని నెలల క్రితం కన్నేపల్లి, భీమిని మండలాల్లో ఓ నకిలీ పత్తి విత్తనాల లారీ లోడ్‌ను పోలీసుల నుంచి తప్పించడంలో ఓ కాంగ్రెస్ లీడర్ కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ మధ్యకాలంలో అక్రమ రేషన్ దందాను కాంగ్రెస్ లీడర్లు అన్నీ తామై నడుపుతున్నారు. కన్నేపల్లికి చెందిన ఇద్దరు కీలక లీడర్లు రేషన్ డీలర్ల నుంచి నేరుగా బియ్యాన్ని తీసుకెళ్లి పక్క రాష్ట్రంలో వదులుతున్నారు. అంతకుముందు ఈ దందా తాండూర్, రెబ్బెన కేంద్రంగా సాగితే ఇప్పుడు కన్నేపల్లి మండలం కేంద్రంగా చేసుకుని ఓ ఇద్దరు కాంగ్రెస్ నాయకులు దందాను నడిపిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇలా ప్రతి అక్రమ దందాలోనూ కాంగ్రెసోళ్లు జోక్యం చేసుకోవడం కూడా బెల్లంపల్లిలో ఆ పార్టీకి మైనస్‌గా మారింది. మరి ఇప్పటికైనా ఎమ్మెల్యే సారు.. స్థానికంగా అందుబాటులో ఉంటూ.. వాళ్ల లీడర్లను కంట్రోల్ పెడతారా లేదా చూడాలి మరీ.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

