Cinematographer | సినిమా సెలబ్రిటీలపై అభిమానులు ఎంతగా ప్రేమ చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ అభిమానాన్ని చూపించేందుకు అభిమానులు ఒక్కోసారి హద్దులు కూడా దాటుతుంటారు. ఇంకొందరు అయితే తమ బాడీపై హీరోల, హీరోయిన్ల పేర్లను, ఫొటోలని టాటూలుగా వేయించుకుంటారు. అయితే ఇటీవల ఓ వ్యక్తి హీరో, హీరోయిన్స్ టాటూ కాకుండ , కెమెరా వెనుక పని చేసే సినిమాటోగ్రాఫర్ టాటూ వేయించుకోవడం విశేషంగా మారింది. రిషి అనే ఈ అభిమాని, రీసెంట్గా జరిగిన జూనియర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరయ్యాడు. ఈ ఈవెంట్‌కి హాజరైన స్టార్ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ను కలిసిన తన చేతిపై వేసుకున్న సెంథిల్ కుమార్ టాటూను చూపించి అతన్ని ఆశ్చర్యపరిచాడు రిషి.
ఈ సంఘటనను అక్కడ ఉన్న వారు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, అవి కాస్తా వైరల్ అయ్యాయి.ఫోటోలు చూసిన నెటిజన్లు .. “సినిమాటోగ్రాఫర్కూ ఇంత క్రేజ్ ఉందా?” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక రిషి కూడా సినీ రంగంలో కెమెరా డిపార్ట్మెంట్లో పని చేస్తున్నాడట. సెంథిల్ కుమార్ వర్క్‌ని ప్రేరణగా తీసుకుని, ఒకరోజు తనలాంటి స్టార్ సినిమాటోగ్రాఫర్ కావాలన్నదే రిషి కల. తన అభిమానాన్ని చూపించడానికి, ఆయనను “ఏకలవ్య శిష్యుడు”గా భావించి టాటూ వేయించుకున్నాడు.ఇక సెంథిల్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే .. ఫిలిం ఇన్స్టిట్యూట్లో కెమెరా కోర్సు పూర్తి చేసి, కెమెరా డిపార్ట్మెంట్లో పని చేసిన తర్వాత “ఐతే” సినిమా ద్వారా సినిమాటోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించారు.
ఆ తర్వాత రాజమౌళితో కలిసి ఛత్రపతి, యమదొంగ, మగధీర, ఈగ, బాహుబలి 1 & 2, RRR వంటి సూపర్‌హిట్ సినిమాలకు పని చేశారు. ఆయన శైలి, విజువల్ ప్రెజెంటేషన్‌కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రీసెంట్గా కిరిటీతో జూనియర్ సినిమా చేశాడు. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక “స్వయంభు”, “ది ఇండియన్ హౌస్” సినిమాలతో బిజీగా ఉన్న సెంథిల్ కుమార్‌కు ఇలాంటి అభిమానులు ఉండడం గొప్ప విషయమే అంటున్నారు.