 
                                                            సినిమాటికా ఎక్స్పో భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుందని, సినిమాకు సంబంధించిన టెక్నాలజీ, ఆర్ట్, కల్చర్లను ఒకే వేదిక మీదికి తీసుకొచ్చి సాంకేతిక విప్లవానికి మార్గదర్శకంగా నిలుస్తుందనే నమ్మకం ఉందని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీజీ విందా చెప్పారు నవంబర్ 1, 2వ తేదీలలో హైదరాబాద్ హెచ్ఐసీసీ వేదికగా సినిమాటికా ఎక్స్పో మూడవ ఎడిషన్‌ను నిర్వహించబోతున్నారు. ఇందులో సినిమాటోగ్రఫీ, వీఎఫ్ఎక్స్, వర్చువల్ ప్రొడక్షన్, ఏఐ ఫిల్మ్ మేకింగ్ వంటి ఆధునిక సాంకేతికతలపై మాస్టర్ క్లాసులు, వర్క్‌షాపులు నిర్వహించబోతున్నారు.
ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో పీజీ విందా సినిమాటికా ఎక్స్పో విశేషాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ ‘ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటేనే ఫిల్మ్‌మేకింగ్‌లో అద్భుతాలు చేయొచ్చు. గత సంవత్సరం వేలాది మంది బ్లాగర్స్, కంటెంట్ క్రియేటర్స్, సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్ ఇందులో భాగమయ్యారు. హైదరాబాద్‌లో మొదలైన ఈ ఈవెంట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి చేరుకుంది. ఈ ఏడాది ఎక్స్‌పోలో అవార్డుల ప్రదానం కూడా ఉంటుంది. సినీ ఔత్సాహికులకు ఇదొక గొప్ప వేదిక’ అన్నారు.
 
                            