‘సినిమా అనేది ప్రజల సమస్యలను పెంచకూడదు. వినోదాన్ని మాత్రమే పంచాలి.’ అంటున్నారు బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి. ఇటీవల ఓ ప్రెస్మీట్లో ఆమె నేటి సినిమాల గురించి ఆసక్తికరంగా మాట్లాడారు. ‘స్క్రిప్ట్ ఎంచుకునే విషయంలో నేను కొన్ని విలువలకు కట్టుబడి ఉంటా. సినిమా ప్రజల్లో ద్వేషాన్ని పెంచేలా ఉండకూడదని భావిస్తాను. కథల ఎంపికల విషయంలో డబ్బు ఒక్కటే ప్రామాణికం కాదు. నా ఎంపికలన్నీ విలువలతో కూడుకున్నవే.’ అని తెలిపారామె.
గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్, మహారాణి, హీరా మండి చిత్రాల్లో ప్రయోగాత్మక పాత్రలతో మెప్పించిన హ్యూమా.. రీసెంట్గా రిలీజైన ‘ఢిల్లీ క్రైమ్’ వెబ్‌సీరీస్ సీజన్ 3లో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఆమె నిర్మాతగానూ కొనసాగుతున్నది.