మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి చుప్ (Chup). ఆర్ బాల్కీ (R Balki) దర్శకత్వం వహిస్తున్నాడు. సన్నీడియోల్ కీ రోల్ చేస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు. ట్రైలర్ సీరియల్ కిల్లర్‌గా మారిన ఆర్టిస్ట్ ప్రతీకారం నేపథ్యంలో సస్పెన్స్‌గా సాగుతూ క్యూరియాసిటీని పెంచుతోంది.
ఈ చిత్రంలో సన్నీడియోల పో లీసాఫీసర్గా నటిస్తున్నాడు. శ్రేయాధన్వంతరీ ప్రేమలో పడ్డ యువకుడి పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు. సీరియల్ కిల్లర్ ఎవరనేది సస్పెన్స్ లో పెట్టి..సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాడు డైరెక్టర్. పెన్ స్టూడియోస్, హోప్ ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రంలోశ్రేయా ధన్వంతరీ (Chup) ఫీ మేల్ లీడ్ రోల్లో పోషిస్తోంది. సెప్టెంబర్ 30న విడుదల కానుంది.
Read Also : Pawan Kalyan | ‘సాహో’ దర్శకుడితో పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ?
Read Also : Manchu Manoj | రెండో పెళ్ళికి సిద్ధమైన మంచు మనోజ్.. అమ్మాయి ఎవరో తెలుసా?