కన్నడ నటుడు పృథ్వీ, కన్నడ దర్శకుడు చంద్రశేఖర్ బండియప్ప కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘చౌకీదార్’. నిర్మాతల్లో ఒకరైన పృథ్వీ ఇందులో కథానాయకుడు కాగా, మరో నిర్మాత చంద్రశేఖర్ బండియప్ప దర్శకుడు. కన్నడ స్టార్ శ్రీమురళి చిత్ర యూనిట్కి శుభాకాంక్షలు అందిస్తూ ఈ టైటిల్ను ప్రకటించారు.
కన్నడతోపాటు పలు ఇతర భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు. టైటిల్ను చూసి ఇది మాస్ సినిమా అనుకోవద్దని, నిజానికి ఇది కుటుంబకథాచిత్రమని, చంద్రశేఖర్ బండియప్ప సరికొత్త కథతో మీ ముందుకు రానున్నారని పృథ్వీ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సచిన్ బస్రూర్.