Veera Dheera Sooran | కోలీవుడ్ స్టార్ యాక్టర్ చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రాల్లో ఒకటి వీరధీరసూరన్ (Veera Dheera Sooran). ఛియాన్ 62గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి చిత్త (చిన్నా) ఫేం ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే టైటిల్ టీజర్ లాంచ్ చేశారని తెలిసిందే.
తాజాగా టీజర్ విడుదల చేశారు. విక్రమ్ గ్యాంగ్‌కు, పోలీసులకు మధ్య జరిగే పోరు నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు టీజర్ చెప్పకనే చెబుతోంది. విక్రమ్‌ను చాలా రోజుల తర్వాత నయా అవతార్‌లో చూపించబోతున్నట్టు టీజర్‌తో హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్. ఈ సారి విక్రమ్ పక్కా యాక్షన్ ప్యాక్డ్ కమర్షియల్ సినిమాతో రాబోతున్నాడని టీజర్ చెప్పకనే చెబుతోంది.
ఈ మూవీలో కోలీవుడ్ భామ దుషారా విజయన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని 2025 పొంగళ్ కానుకగా జనవరిలో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రంలో పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎస్జే సూర్య, పాపులర్ మలయాళ నటుడు సూరజ్ వెంజరమూడు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ రెండు పార్టులుగా రాబోతుంది.
వీర ధీర సూరన్ టీజర్..
Fear Trailer | సైలెంట్‌గా భయపెట్టిస్తోన్న బూచోడు.. సస్పెన్స్‌గా వేదిక ఫియర్ ట్రైలర్