Chiyaan Vikram | కేరళలోని వయనాడ్ (Stand With Wayanad) జిల్లాను ప్రకృతి విపత్తు అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. మంగళవారం తెల్లవారుజామున మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో భారీ కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 250కిపైగా ధాటింది. ఇంకా వందలాది మంది మట్టిదిబ్బల కింద చిక్కుకున్నట్లు అధికారులు, పోలీసులు అంచనా వేస్తున్నారు.
కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక బృందం, జాతీయ విపత్తు స్పందన దళాలు, అదనపు బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని మట్టిదిబ్బలను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. విపత్తులో నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు తమిళ నటుడు చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) ముందుకొచ్చాడు. ఈ మేరకు తన వంతుగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.20 లక్షలు అందజేశాడు. మరో స్టార్ యాక్టర్ సూర్య-జ్యోతిక దంపతులు కార్తీ రూ.50 లక్షలు విరాళంగా ప్రకటించారు. విక్రమ్, సూర్య చూపించిన గొప్ప ఔదార్యానికి అభిమానులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
#ChiyaanVikram Donated 20 Lakhs to Kerala Chief Minister for the #WayanadLandslides Disaster.
Pray for #Wayanad 🙏🏼 pic.twitter.com/UnDilNWONj
— Tharani ᖇᵗк (@iam_Tharani) July 31, 2024
#Suriya | #Jyotika | #Karthi Together Donated 50Lakhs To Kerala CM Relief Fund For #WayanadFloods ❤️👌
This Family Never Misses To Contribute To The People!! pic.twitter.com/EbC5jo9djT
— Saloon Kada Shanmugam (@saloon_kada) August 1, 2024
Thangalaan | తుఫాను వచ్చేస్తుంది.. విక్రమ్ తంగలాన్ అడ్వెంచరస్ రైడ్‌కు రెడీనా..?
NBK 109 | షూటింగ్ స్పాట్లో బాబీ.. బాలకృష్ణ ఎన్బీకే 109 డైరెక్టర్‌కు బర్త్ డే విషెస్
Buddy | ఇంతకీ అల్లు శిరీష్ బడ్డీలో టెడ్డీబేర్ పాత్రలో నటించిందెవరో తెలుసా..?