Ponnambalam | తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని తమిళ నటుడు, పాపులర్ ఫైట్ మాస్టర్ పొన్నాంబళం. తెలుగులో మోహన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, రాజశేఖర్, జగపతిబాబు లాంటి అగ్రహీరోల సినిమాల్లో విలన్గా నటించాడు. కాగా ఈ టాలెంటెడ్ యాక్టర్ కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడని తెలిసిందే. అయితే కష్టకాలంలో తనకు కోస్టార్ చిరంజీవి కొండంత అండగా ఉన్నాడంటూ ఇప్పటికే చాలా సార్లు మీడియాతో షేర్ చేసుకున్నాడు పొన్నాంబళం.
కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్న పొన్నాంబళం ఇప్పుడు రికవరీ అయ్యాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ మరోసారి చిరంజీవి తనకు చేసిన సాయాన్ని గుర్తు చేసుకున్నాడు. పొన్నాంబళం ఇప్పుడు కిడ్నీ సంబంధిత సమస్యలను పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నాడు. అయితే తనకెప్పుడు అవకాశమొచ్చినా చిరంజీవి పట్ల తనకు చేసిన సాయాన్ని గుర్తు చేస్తూనే ఉంటాడు.
ఓ సందర్భంగా తాను చిరంజీవి దగ్గర నుంచి లక్ష రూపాయలు సాయం వస్తుందని అనుకున్నానని.. కానీ ఇప్పటివరకు చిరంజీవి తనకు కోటి రూపాయల దాకా సాయం చేశారని చెప్పుకొచ్చాడు. నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు సాయం కోసం చిరంజీవి సార్కు కాల్ చేశాను. ఆయన లక్ష రూపాయలు సాయం చేస్తారనుకున్నా.. కానీ ఇప్పటివరకు ఆయన నాకు కోటి రూపాయలకుపైగా సాయం చేశాడంటూ చెప్పుకొచ్చాడు.
చిరంజీవి 69వ పుట్టినరోజు ఈవెంట్ సందర్భంగా పొన్నాంబళం కామెంట్స్..
నేను ఇప్పటివరకు 1500 సినిమాల్లో ఫైట్స్ చేశాను. 1985-86లో మా రోజూ జీతం రూ.350.. కానీ చిరంజీవి సినిమా షూటింగ్ టైంలో మాత్రం ఫైటర్లకు రూ.1000 ఇచ్చేవారు. నాకు కిడ్నీ ఫెయిల్యూర్ అయితే చిరంజీవికి ఒకే ఒక ఫోన్ చేసి.. అన్నా నాకు శరీరం బాగా లేదని చెబితే.. ఆయన ఏంటీ నీకా అని అన్నారు.
నేను అంతకుముందు ఆంజనేయ స్వామి గుడికి వెళ్లా. నాకు ఎవరు సాయం చేస్తారని ఆలోచిస్తున్నా. అప్పుడు పూజారి వచ్చి చిరంజీవి సుఖీభవ అన్నారు. అలా నాకు చిరంజీవి రూపంలో పరిష్కారం దొరికిందన్నాడు పొన్నాంబళం. నాకు కిడ్నీ ఫెయిల్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు చిరంజీవి నా చికిత్స కోసం రూ.60 లక్షలకుపైగా ఖర్చు పెట్టారు. కేవలం చిరంజీవి వల్లే నేను ఈ రోజు మీ ముందు ఇలా ఉన్నా. ఈ జీవితం ఆయన ఇచ్చినదేనంటూ స్టేజీపై భావోద్వేగానికి లోనయ్యాడు.