నందమూరి బాలకృష్ణ ఈ రోజు 61వ బర్త్ డే జరుపుకుంటున్న సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు నందమూరి ఫ్యాన్స్ చేస్తోన్న ట్వీట్ల సమరానికి ట్విట్టర్లో బాలయ్య బాబు పేరు జాతీయ స్థాయిలో వినిపిస్తోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన స్నేహితుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. మిత్రుడు బాలకృష్ణ కి జన్మ దిన శుభాకాంక్షలు.మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని తన ట్వీట్ లో పేర్కొన్నారు చిరు.
ఇక జూనియర్ తన బాబాయ్ రేర్ ఫొటోని షేర్ చేస్తూ.. జన్మదిన శుభాకాంక్షలు బాల బాబాయ్.మీరు అన్నివేళలా ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను అని 61వ బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారు. అలానే కళ్యాణ్ రామ్ కూడా తన బాబాయ్‌కు శుభాకాంక్షలు అందించారు. 61వ పుట్టిన రోజు జరపుకుంటున్న మీరు ఎప్పుడూ సంతోషం గా ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌డే బాబాయ్ అని కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణి కూడా తన తండ్రికి ప్రత్యేకంగా విషెస్ అందజేశారు. పవర్ హౌస్ అంటూ తన నాన్నను బ్రాహ్మణి పొగిడేశారు. కాగా, కొవిడ్ సెకండ్ వేవ్ తీవ్రత దృష్ట్యా ఈసారి తన బర్త్‌డేకు సంబంధించిన కార్యక్రమాలు వద్దని, అందరూ తమ తమ కుటుంబ సభ్యులతోనే గడపాలని ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే.
జన్మదిన శుభాకాంక్షలు బాల బాబాయ్.మీరు అన్నివేళలా ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. Wishing you a very Happy 61st Birthday Babai #HappyBirthdayNBK pic.twitter.com/fbR1nfmqn5
— Jr NTR (@tarak9999) June 10, 2021
మిత్రుడు బాలకృష్ణ కి జన్మ దిన శుభాకాంక్షలు.మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.💐💐 #NBK
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 10, 2021
BAlayya BAbu kI janmadhina subhakankshallu..
— RAm POthineni (@ramsayz) June 10, 2021
When you meet the man,you’ll know.. & this is one of my fav pictures..still remember the mad fun at that event..looking forward to #Akhanda 🔥
Love..#RAPO pic.twitter.com/d10SEWNDgy
Happy birthday dear Balakrishna gaaru!! Hope you have a peaceful and safe year ahead🙏🏼🥳#HBDBalakrishna #HBDBALAYYA pic.twitter.com/bL6Q8Iejoz
— Venkatesh Daggubati (@VenkyMama) June 10, 2021
A very happy birthday #Balakrishna garu. Good health and happiness always. Have a memorable year! 😊
— Mahesh Babu (@urstrulyMahesh) June 10, 2021