Chiranjeevi| మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యూకే పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్గా బ్రిడ్జి ఇండియా సంస్థ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ పురస్కారంతో చిరును గౌరవించింది.ఇక ఈ పర్యటనలో భాగంగా చిరంజీవి అక్కడి అభిమానులతో సమావేశమై అభిమానులతో ముచ్చటించారు. మీరంతా నా తమ్ముళ్లు, చెల్లెళ్లు. మీరు సాధించే ప్రతి విజయం నా విజయంగానే భావిస్తాను. ఏదో ఒక సందర్భంలో నా సినిమా చూసి మీరంతా స్పందించారు.. మీ అభిమానానికి నేను ఎంతో రుణపడి ఉంటాను. మీ ఇళ్లకు వచ్చి మీతో మాట్లాడాలని, మీ చేతి వంట తినాలని ఉంది. అవకాశం వస్తే తప్పకుండా వస్తాను అంటూ చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
గత రెండు రోజులుగా చిరంజీవి యుకెలో పర్యటిస్తుండగా, తెలుగు వారితో, ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తూ ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో ప్రధాని మోదీతో మాట్లాడిన విషయాలని కూడా గుర్తు చేసుకున్నారు.. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి ప్రమాణ స్వీకారం చేసిన రోజు స్టేజిపై పవన్ మోదీని చిరంజీవి దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడించడం మనం చూశాం. అందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ఆ రోజు చిరు కళ్లలో సంతోషం మనం ఎన్ని వేల కోట్లు ఇచ్చిన కొనలేనిది.ఇక అదే సందర్భంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ , మోదీ కలిసి మాట్లాడుకున్న విజువల్స్ వైరల్ అయ్యాయి.
అయితే తాజాగా యూకే ఫ్యాన్స్ మీట్ లో చిరంజీవి ఆ రోజు మోదీ తనతో ఏం మాట్లాడారో వివరించారు. ఆ రోజు మోదీ గారు మాట్లాడిన మాటలు నాకు ఇంకా గుర్తు ఉన్నాను. ఎమ్మెల్యేగా పవన్ గెలిచి నా ఇంటికొచ్చిన వీడియో మోదీ చూశారట. తమ్ముడిని ఆహ్వానించి, ఆశీర్వదించిన తీరు ఆయన హృదయాన్ని తాకిందని, అది చూసి కన్నీళ్లు కూడా వచ్చాయని మోదీ చెప్పారని చిరంజీవి స్పష్టం చేశారు. అన్నదమ్ములు ఎలా ఉండాలో మీరు చూపించారని ఆయన మెచ్చుకున్నారు అంటూ మెగాస్టార్ తెలిపారు. ఈ విషయాన్ని గతంలో సోషల్ మీడియాలో పంచుకున్న చిరంజీవి ఇప్పుడు యూకే ఫ్యాన్స్ ముందు చెప్పారు.