Chiranjeevi |ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. కాగా ఈ క్రేజీ టాలెంటెడ్ డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. ఇప్పుడిక మూవీ లవర్స్ ఫోకస్ అంతా ఈ ప్రాజెక్ట్‌పైనే పడింది. ఇంతకీ చిరు-అనిల్ రావిపూడి కలయికలో ఎలాంటి సినిమా ఉండబోతుందంటూ ఇండస్ట్రీ అంతా తెగ చర్చ నడుస్తోంది.
షైన్‌స్క్రీన్స్ సినిమా నిర్మాత సాహు గారపాటి చేసిన కామెంట్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి. విశ్వక్ సేన్ లైలా ప్రమోషన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవడం పక్కా. అనిల్ రావిపూడి కెరీర్లో ట్రిపుల్ హ్యాట్రిక్ మార్క్ సినిమాగా నిలుస్తుందన్నారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో సాహు గారపాటి మాట్లాడుతూ.. అనిల్ రావిపూడి- చిరు సినిమా యాక్షన్ ఎలిమెంట్స్‌తో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని కూడా చెప్పారు. ఇక సాహు గారపాటి చేసిన కామెంట్స్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ కొనసాగుతుండగా.. పూర్తయిన వెంటనే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన ఉండబోతుందని ఇన్ సైడ్ టాక్. ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. చిరంజీవి ప్రస్తుతం సోషియా ఫాంటసీ నేపథ్యంలో వస్తోన్న విశ్వంభర చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. మరోవైపు దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో కూడా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ కూడా ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది.
MASS Jathara | రవన్న మాస్ దావత్ షురూ.. రవితేజ మాస్ జాతర గ్లింప్స్ వచ్చేస్తుంది