Nattikumar | తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వర్కర్స్ ఫెడరేషన్‌కు చెందిన 24 కార్మిక సంఘాలు వేతనాల పెంపు కోసం సినిమా షూటింగ్‌లను నిలిపివేసి బంద్‌కు కొనసాగిస్తున్నారని తెలిసిందే. వర్కర్ల ప్రధాన డిమాండ్ వేతనాలను 30 శాతం మేర పెంచాలని.. ఫెడరేషన్ ప్రతినిధులు ఫిలిం ఛాంబర్‌తో చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు అనుకూల ఫలితాలు ఇవ్వకపోవడంతో నిరసనగా బంద్ ప్రకటించారు. కార్మికులు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో కమిషనర్ ఆఫీసుకు కూడా వెళ్లారు. ఈ నేపథ్యంలో సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంపై చిరంజీవితో నిర్మాతలు సమావేశమై చర్చలు కూడా జరిపారు.
అయితే ఈ వ్యవహారంలో తాజాగా చిరంజీవితో చిన్న నిర్మాతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నట్టికుమార్, సురేందర్ రెడ్డి, యలమంచిలి రవి, ఆచంట గోపీనాథ్, కేశవరావు పాల్గొన్నారు. సినీ కార్మికుల సమ్మె, చిన్న నిర్మాతల సమస్యలపై ఈ భేటీలో చర్చించారు. అనంతరం నిర్మాత నట్టికుమార్ మీడియాతో మాట్లాడుతూ.. మా బాధలను చిరంజీవికి వివరించామని అన్నారు. చిన్న సినిమాలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరాం. రేపు ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులతో మాట్లాడుతానని చిరంజీవి అన్నారు. సమస్య పరిష్కారానికి చిరంజీవి కృషి చేస్తానన్నారని చెప్పారు నట్టికుమార్.
చిరంజీవితో గతంలో జరిగిన భేటీ సందర్భంగా నిర్మాత సీ కల్యాణ్ కామెంట్స్..
సినీ కార్మికుల వేతనాలపై చాంబర్, యూనియన్లు చర్చలతో ముందుకెళ్లాలని చిరంజీవి సూచించారు. మీరు సామరస్యంగా చర్చలు జరిపి షూటింగ్ మొదలు పెడితే ఒకే.. లేకపోతే రెండు మూడు రోజుల వరకూ వేచిచూస్తానని ఆయన చెప్పారు. అప్పటిదాకా మీరు సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. అప్పటికీ పరిష్కారం కాకపోతే తన నిర్ణయం చెబుతానన్న చిరంజీవి పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో చిరంజీవి సూచన ఫాలో అవుతామని చెప్పారు సీ కల్యాణ్.
Vijay Devarakonda | న్యూయార్క్ ఇండియా డే పరేడ్‌లో విజయ్ దేవరకొండ.. వీడియో
Dhoni Fan | ధోనీకి వీరాభిమాని..హెలిక్యాప్టర్ షాట్లతో అలరిస్తున్న బుడ్డోడు.. వీడియో..!
Mareesan OTT | ఓటీటీలోకి ఫహాద్ ఫాసిల్, వడివేలు కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!