ఎంతోకాలంగా సినిమా టికెట్ల రేట్ల (Movie Ticket Prices) పెంపు విషయంలో డైలామాలో ఉన్న టాలీవుడ్ (Tollywood) సినీ పరిశ్రమకు, థియేటర్ల యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లకు శుభవార్త అందించిన ఏపీ ప్రభుత్వానికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీలో సినిమా టికెట్స్ రేట్ల (AP Movie Ticket Prices) ను పెంచుతూ జీవో జారీచేసిన ఏపీ సీఎం జగన్ (YS Rajasekhara Reddy) కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు చిరంజీవి.
తెలుగు సినీ పరిశ్రమకు మేలు కలిగే విధంగా అటు థియేటర్ల మనుగడను, ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలనే సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా టికెట్ల రేట్లు పెంచుతూ జీవోజారీచేసిన సీఎం వైఎస్ జగన్కు సినీ పరిశ్రమ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. చిన్న సినిమాకు ఐదో షో అవకాశం కల్పించడం ఎందరో నిర్మాతలకు ఉపయోగపడే అంశం. సంబంధింత శాఖ మంత్రి పేర్ని నాని, అధికారులు, కమిటీ సభ్యులకు ధన్యవాదాలు అని చిరు ట్వీట్ చేశారు.
Thank you Sri. @ysjagan garu @AndhraPradeshCM pic.twitter.com/BsvmsEPrxt
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 7, 2022
ఏపీ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో ప్రకారం టికెట్ కనిష్ట ధర రూ.20గా, గరిష్ట ధర రూ.250గా నిర్దారించింది. టికెట్ల రేట్ల పెంపు నిర్ణయంతో ఏపీలో సినిమాల విడుదల విషయంలో నెలకొన్న ఆందోళనకు తెరపడినట్టైంది.