తెలుగు రాష్ట్రాలలో కరోనా విలయతాండవం చేస్తుంది.ప్రముఖులు, సామాన్యులు కరోనా బారిన పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా పాజిటివ్ రిపోర్ట్ రాగా, ఈ రోజు ఆయన తనయుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు కూడా కరోనా అని తేలింది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
కేటీఆర్‌కు కరోనా అని తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు త్వరగా కోలుకోవాలని ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్లో ప్రియమైన కేటీఆర్.. మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను’.. అని ట్వీట్ చేశారు. కాగా, గత ఏడాది చిరంజీవికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్టు తప్పుడు రిపోర్ట్ రాగా, దానిపై ఆయన సెటైరికల్‌గా కామెంట్ చేసిన విషయం తెలిసిందే.
Dear @KTRTRS Wishing you a speedy recovery. Get well soon!
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 23, 2021