Mothers Day | నేడు మదర్స్ డే (Mothers day) సందర్భంగా సామాన్యులతోపాటు సెలబ్రిటీలంతా.. తమ మాతృమూర్తులను గుర్తు చేసుకుంటున్నారు. తమకు జన్మనిచ్చిన తల్లుల వెలకట్టలేని సేవలను స్మరించుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మదర్స్ డేను పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తల్లితో మరుపురాని క్షణాలను గుర్తు చేసుకుంటూ కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
అనురాగం, మమకారం… ఈ రెండిటికి అర్ధమే అమ్మ .. అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం. నిరాడంబరంగా ఉండటం మేమందరం అమ్మని చూసే నేర్చుకున్నాం. అమ్మలందరికి హ్యాపీ మదర్స్ డే.. అంటూ ట్వీట్ చేశాడు. తల్లి అంజనా దేవి, సోదరుడు నాగేంద్రబాబు, సోదరీమణులతో కలిసి దిగిన ఫొటోలను ట్విట్టర్ ద్వారా అందరితో షేర్ చేసుకున్నాడు. మరోవైపు అమ్మతో సోదరుడు పవన్ కల్యాణ్ దిగిన మరో స్టిల్‌ను కూడా షేర్ చేశాడు. ఇప్పుడు ఈ ఫొటోలు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
అమ్మతో చిరంజీవి ఫ్యామిలీ..
అనురాగం, మమకారం… ఈ రెండిటికి అర్ధమే అమ్మ … అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం. నిరాడంబరంగా ఉండటం మేమందరం
అమ్మ ని చూసే నేర్చుకున్నాం.
అమ్మలందరికి #HappyMothersDay🙏💐 pic.twitter.com/6Xm4l1R14d— Chiranjeevi Konidela (@KChiruTweets) May 14, 2023
Bedurulanka 2012 | కార్తికేయ బెదురులంక 2012 థియేటర్లకు వచ్చే టైం ఫిక్స్
Jr NTR | ఆస్కార్ తర్వాత తారక్ కాస్లీ కమర్షియల్ యాడ్
Double iSmart | సీక్వెల్‌కు డబుల్ ఇస్మార్ట్ టైటిల్.. పూరీ, రామ్ ప్రాజెక్ట్ వివరాలివే