Bedurulanka 2012 | గతేడాది అజిత్ హీరోగా నటించిన వలిమై చిత్రంలో విలన్‌గా ఎంటర్టైన్ చేశాడు ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ (Kartikeya). ఈ యంగ్ యాక్టర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ బెదురులంక 2012 (Bedurulanka2012). క్లాక్స్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో డీజే టిల్లు ఫేం నేహాశెట్టి ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఇప్పటికే విడుదలైన బెదురులంక 2012 ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, గ్లింప్స్ వీడియో, టీజర్ నెట్టింట్లో వైరల్ అవుతూ.. సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
తాజాగా ఈ సినిమా విడుదలపై క్లారిటీ ఇస్తూ.. స్పెషల్ లుక్ ఒకటి విడుదల చేశారు మేకర్స్. మన బెదురులంక 2012 వరల్డ్ ఫేమస్ అయ్యేందుకు రెడీ అయింది.. అంటూ ఈ చిత్రాన్ని జూన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. అయితే విడుదలయ్యేది ఏ రోజు అనేది మాత్రం సస్పెన్స్ లో పెట్టారు. ఈ చిత్రం నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్ సింగిల్ వెన్నెల్లో ఆడపిల్ల పాట మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. విలేజ్ నేపథ్యంలో సాగే కథతో బెదురులంక 2012 వస్తోంది. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
లౌక్య ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని (బెన్నీ) నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజయ్ ఘోష్, సత్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సురభి ప్రభావతి, కట్టయ్య, దివ్య నార్ని కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Mana #Bedurulanka2012 🌊 is ready to become world famous🥳
Worldwide IN THEATRES this JUNE 🥁🍿
Also, we wish all the awesome mothers a very Happy Mother’s Day❤️@ActorKartikeya @iamnehashetty #Clax @Benny_Muppaneni #Manisharma @PulagamOfficial @SonyMusicSouth @Ticket_Factory pic.twitter.com/T5ULeLlVPt
— Loukya entertainments (@Loukyaoffl) May 14, 2023
బెదురులంక 2012 టీజర్..
వెన్నెల్లో ఆడపిల్ల రొమాంటిక్ ట్రాక్..
బెదురులంక 2012 గ్లింప్స్ వీడియో..
బెదురులంక 2012 మోషన్ పోస్టర్.. వీడియో