Ponnambalam |టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి 69వ పుట్టినరోజు (Chiranjeevi birthday)వేడుకలను అభిమానులను ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు చెన్నై నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్‌కు వచ్చాడు పాపులర్ ఫైట్ మాస్టర్ పొన్నాంబళం (Ponnambalam) . ఈవెంట్లో పొన్నాంబళం స్టేజ్‌పై మాట్లాడుతూ.. నేను ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇప్పటివరకు 1500 సినిమాల్లో ఫైట్స్ చేశాను. 1985-86లో మా రోజూ జీతం రూ.350.. కానీ చిరంజీవి సినిమా షూటింగ్ టైంలో మాత్రం ఫైటర్లకు రూ.1000 ఇచ్చేవారు. నాకు కిడ్నీ ఫెయిల్యూర్ అయితే చిరంజీవికి ఒకే ఒక ఫోన్ చేసి.. అన్నా నాకు శరీరం బాగా లేదని చెబితే.. ఆయన ఏంటీ నీకా అని అన్నారు.
నేను అంతకుముందు ఆంజనేయ స్వామి గుడికి వెళ్లా. నాకు ఎవరు సాయం చేస్తారని ఆలోచిస్తున్నా. అప్పుడు పూజారి వచ్చి చిరంజీవి సుఖీభవ అన్నారు. అలా నాకు చిరంజీవి రూపంలో పరిష్కారం దొరికిందన్నాడు పొన్నాంబళం. నాకు కిడ్నీ ఫెయిల్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు చిరంజీవి నా చికిత్స కోసం రూ.60 లక్షలకుపైగా ఖర్చు పెట్టారు. కేవలం చిరంజీవి వల్లే నేను ఈ రోజు మీ ముందు ఇలా ఉన్నా. ఈ జీవితం ఆయన ఇచ్చినదేనంటూ భావోద్వేగానికి లోనయ్యాడు పొన్నాంబళం. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Demonte Colony 3 | డెమోంటే కాలనీ 3 కూడా వచ్చేస్తుంది.. అప్పుడే విడుదల టైం కూడా ఫిక్స్
Kalki 2898 AD | పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రభాస్ కల్కి 2898 ఏడీ.. ఏఏ భాషల్లోనంటే..?
Vishwambhara | చిరంజీవి బర్త్ డే స్పెషల్.. త్రిశూలంతో విశ్వంభర లుక్ వైరల్
Nani | ప్రభాస్‌పై కామెంట్స్‌తో పాపులర్.. అర్షద్ వర్షి వివాదంపై నాని