Sirish Bharadwaj | మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ (Sirish Bharadwaj) కన్నమూశారు. గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్య సమసల్యతో బాధపడుతున్నట్లు సమాచారం. లంగ్స్ డ్యామేజ్ తో హైదారాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించినట్లు తెలిసింది. శిరీష్ మృతి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, శిరీష్ భరద్వాజ్.. చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ (Sreeja Konidela)ని 2007 ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్నేళ్లకు వీరిద్దరూ విడిపోయారు. ఈ జంటకు ఓ పాప నివ్రతి ఉంది. ఆ తర్వాత శిరీష్ రెండో పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక శిరీష్‌తో విడిపోయిన అనంతరం హీరో కల్యాణ్ దేవ్‌ను శ్రీజ రెండో పెళ్లి చేసుకుంది. ఈ జంటకు కూడా నవిష్క అనే పాప ఉంది. ప్రస్తుతం శ్రీజ తన ఇద్దరు పిల్లలతో కలిసి చిరంజీవి ఇంట్లోనే ఉంటోంది.
Also Read..
Hajj Pilgrims | హజ్ యాత్రలో మృత్యుఘోష.. ఈ ఏడాది 550 మంది యాత్రికులు మృతి..!
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కల్యాణ్