అక్టోబర్ 10 ‘మా’ ఎన్నికల కోసం హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభం కాగా, మధ్యాహ్నాం 2గం.లకు పూర్తి కానుంది. ఈ రోజు ఉదయాన్నే మంచు విష్ణు ప్యానల్ సభ్యులంతా పోలింగ్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. నరేష్, మోహన్ బాబు, మంచు విష్ణు సహా విష్ణు భార్య విరానిక కూడా అక్కడికి చేరుకొని గెలుపుపై ధీమాగా కనిపించారు. ప్రకాశ్ రాజ్ వచ్చిన సమయంలో విష్ణుని కలిసి హగ్ ఇచ్చారు.
ఇక ఓటు వేసేందుకు ఒక్కొక్కరు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ ,చిరంజీవి, రామ్ చరణ్, బాలకృష్ణ, తనికెళ్ల తనికెళ్ళ భరణి, రఘుబాబు, ఆకాశ్ పూరి తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న చిరంజీవి మాట్లాడుతూ.. ఓటర్లే విజేతలు ఎవరనేది నిర్ణయిస్తారు. ప్రకాశ్ రాజ్ కి మెగా ఫ్యామిలీ మద్దతు ఉందనేది అవాస్తవం అని అన్నారు.