Allu Arjun | సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు సినీ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun)ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ అనంతరం బన్నీని పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ స్టేట్మెంట్ను రికార్డు చేస్తున్నారు. మరికాసేపట్లో వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించనున్నట్లు తెలిసింది. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. ఈ మేరకు అల్లు అర్జున్ను రిమాండ్కు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు అరెస్ట్ చేసే సమయంలో బన్నీ నివాసం దగ్గర హైడ్రామా కొనసాగింది. పోలీసుల తీరుపై అల్లు అర్జున్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు తనను తీసుకెళ్లడంలో అభ్యంతరం లేదన్న అల్లు అర్జున్ ఉన్న పళంగా తమతో రావాలంటే ఎలా..? దుస్తులు మార్చుకునేందుకు అవకాశం కూడా ఇవ్వరా..? అంటూ ప్రశ్నించాడు. దీంతో పోలీసులు అల్లు అర్జున్ బెడ్రూం వరకు వెళ్లి డ్రస్ మార్పించి పీఎస్కు తీసుకెళ్లారు.
Also Read..
Allu Arjun | సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్
Allu Arjun | దుస్తులు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వరా..? పోలీసులతో అల్లు అర్జున్
Mohan Babu | కాసేపట్లో మోహన్ బాబు ఇంటికి పోలీసులు..స్టేట్మెంట్ రికార్డ్..!