టాలీవుడ్ (Tollywood) డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ (Puri Jagannadh) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు పూరీ జగన్నాథ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఛార్మీ (Charmee), కరణ్ జోహార్ తో కలిసి నిర్మిస్తున్నలైగర్ సినిమాతో బిజీగా ఉన్నాడు పూరీ. ఆసక్తికర విషయమేంటంటే పూరీ 2019లో తన పుట్టినరోజుకల్లా లైగర్ కథను సిద్దం చేయడం. అప్పుడే ఈ చిత్రంలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కీలక పాత్రలో ఉంటే బాగుంటుందని పూరీ అభిప్రాయపడ్డాడట. అయితే అసాధ్యం కాదనుకున్న పనిని సుసాధ్యం చేయగలిగింది పూరీ ఫ్రెండ్ ఛార్మీ.
ఈ ఏడాది పూరీ జగన్నాథ్ పుట్టినరోజు వచ్చే నాటికి లైగర్ సినిమాలో మైక్ టైసన్ (Mike Tyson)ను భాగస్వామ్యం చేసి..అతనికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది ఛార్మీ. మైక్ టైసన్ ను లైగర్ టీంలోకి స్వాగతం పలుకుతూ చిత్రయూనిట్ అధికారికంగా వీడియోను కూడా విడుదల చేసింది. పూరీ జగన్నాథ్ కు ఇదే పుట్టినరోజు కానుక (Birthday gift). మైక్ టైసన్ తెలుగు సినిమా, తొలి సారి భారతీయ సినిమా చేస్తున్నారు. .అంటూ ట్విటర్ ద్వారా తెలియజేసింది ఛార్మి.
మైక్ టైసన్ పూరీ జగన్నాథ్ సినిమాలో కనిపిస్తున్నారన్న అప్ డేట్ తో లైగర్ పై అంచనాలు ఒక్కసారిగా ఆకాశానికంటుతున్నాయి. 2022లో లైగర్ (Liger) ప్రేక్షకుల ముందుకు రానుంది. గోవాలో పూరీజగన్నాథ్ బర్త్ డే వేడుక వీడియో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
Fuuuuuunnnnnnnn 💃🏼💃🏼 https://t.co/twChZ4JAkw
— Charmme Kaur (@Charmmeofficial) September 28, 2021
Samantha Cycling | వర్షంలో సమంత సైక్లింగ్..వీడియో వైరల్
KondaPolam trailer | నల్లమల అడవిలో శిక్షణ తీసుకున్నా..కొండపొలం ట్రైలర్
Rakul Preet Singh | రకుల్ ప్రీత్ సింగ్ సర్జరీ చేయించుకుందా..?