‘సినీ పరిశ్రమ ఎంతో గొప్పది. ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటిని అవకాశాలుగా మలుచుకుంటూ ఎదుగుతుంటుంది. కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు ఓటీటీ మాధ్యమం చక్కగా ఉపయోగపడుతోంది’ అని అన్నారు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ. లేడీ లయన్ క్రియేషన్స్ బ్యానర్ ఆవిష్కరణ వేడుకు సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. బ్యానర్ లోగోను కె.ఎస్.రామారావు, టీజర్‌ను తమ్మారెడ్డి భరద్వాజ విడుదలచేశారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ‘ఎన్నో కలలతో రాజు ప్రారంభించిన ఈ సంస్థ మంచి సినిమాల్ని, సిరీస్‌లను నిర్మించి విజయాల్ని అందుకోవాలి’ అని తెలిపారు. ‘కొత్త కంటెంట్‌ను ప్రోత్సహించాలనే ఆలోచనతోనే ఈ బ్యానర్‌ను ప్రారంభించాం. మా సంస్థపై తొలి ప్రయత్నంగా ‘లవ్ యూ ఎనిమి’ అనే సిరీస్‌ను నిర్మించాం. ఈ నెలలోనే కొత్త సినిమాను ప్రారంభిస్తాం’ అని నిర్మాత రాజు అన్నారు.