Allu Arjun | బుధవారం రాత్రి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో పుష్ప 2 (Pushpa 2 The Rule) బెనిఫిట్ షో నేపథ్యంలో అల్లు అర్జున్ రాక సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి (39) అనే మహిళ మృతి చెందగా. ఆమె కుమారుడు శ్రీతేజ్ (9) గాయాలపాలై నిమ్స్హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.
ఈ విషయమై డీసీపీ మాట్లాడుతూ.. సంధ్య థియేటర్ మూసివేతకు సిఫార్సు చేశాం. టిక్కెట్స్ తనిఖీల కోసం ప్రేక్షకులను ఒక్కసారిగా అనుమతించారు. థియేటర్ లోపల తొక్కిసలాటతో ఊపిరాడక అవస్థలు పడ్డారు. థియేటర్లో రేవతి, ఆమె కుమారుడు స్పృహ కోల్పోయారు. రేవతి చనిపోయినట్టుగా వైద్యులు నిర్దారించారని చెప్పారు.
మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్, సెక్యూరిటీ సిబ్బందిపై కేసులు నమోదు చేశాం. ముందస్తు చర్యల్లో భాగంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశాం.అల్లు అర్జున్ వస్తున్న విషయం మాకు చెప్పలేదు. థియేటర్ యాజమాన్యం టిక్కెట్స్ అమ్మకాలు, తనిఖీలో నిర్లక్ష్యం వహించిందని పేర్కొన్నారు.
కాగా ఈ ఘటనపై అల్లు అర్జున్ టీం స్పందిస్తూ.. నిన్న రాత్రి సంధ్య థియేటర్లో జరిగిన ఘటన దురదృష్టకరం. ప్రస్తుతం శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మా టీం ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తామని ఇప్పటికే పేర్కొంది.
Fahadh Faasil | వెడ్డింగ్‌లో పుష్ప యాక్టర్ ఫహద్ ఫాసిల్.. ఇంతకీ ఎవరిదో తెలుసా..?
The Girlfriend | రష్మిక మందన్నా ది గర్ల్‌ఫ్రెండ్‌కు స్టార్ హీరో వాయిస్ ఓవర్..!
Ram Gopal Varma | సినిమా టికెట్ ధరల మీదే ఏడుపెందుకు.. రాంగోపాల్ వర్మ పుష్ప 2 ఇడ్లీల కథ చదివారా..?