వివేక్ ఆకస్మిక మృతితో సందిగ్ధంలో ఆ సినిమాలు
ఒక్కోసారి నటుల మరణం దర్శక నిర్మాతలకు కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంటాయి. వాళ్లు కమిటైన సినిమాలు మధ్యలో ఉన్నప్పుడు చనిపోతే..

ఒక్కోసారి నటుల మరణం దర్శక నిర్మాతలకు కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంటాయి. వాళ్లు కమిటైన సినిమాలు మధ్యలో ఉన్నప్పుడు చనిపోతే.. అప్పటిదాకా వాళ్లతో చేసిన సీన్లన్నీ వేరే నటులతో రీషూట్ చేయాల్సి వస్తుంది. అదికాకుండా మళ్లీ ఆ పాత్రకు సరిపోయే వేరే నటుడ్ని సెలెక్ట్ చేయడానికి దర్శకులకు తిప్పలు తప్పవు. ఇప్పుడు తమిళ టాప్ కమెడియన్ వివేక్ ఆకస్మిక మృతితో ఇలాంటి సమస్య వచ్చిపడింది. తమిళంలో దాదాపు 10 సినిమాలు ఇప్పుడు సందిగ్దంలో పడ్డాయి.

తమిళంలోనే కాకుండా తెలుగులోనూ కమెడియన్ వివేక్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. డబ్బింగ్ సినిమాలతో ఇక్కడ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏప్రిల్ 17 వివేక్ గుండెపోటుతో మరణించాడు. ఆయన హఠాన్మరణం తమిళ ఇండస్ట్రీకి తీరని లోటు అనే చెప్పాలి. ఈయన మరణం ఇప్పుడు పలు సినిమాలను సందిగ్దంలో పడేశాయి. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ఇండియన్ 2 సినిమాలో అత్యంత కీలక పాత్ర చేస్తున్నాడు వివేక్. దాదాపు హీరోతో పాటు సినిమా అంతా ఉండే పాత్ర ఇది. ఇప్పుడు ఆయన చనిపోవడంతో అదే పాత్రను మరో కొత్త నటుడితో రీ షూట్ చేసే ఆలోచనలో ఉన్నాడు శంకర్. కేవలం ఆ సినిమా మాత్రమే కాదు.. అరణ్మనై 3, యాదుం ఊరే యావరం కెళిర్, శరవణన్ అరుల్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో కూడా దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి చేశాడు వివేక్.

ఇప్పుడు ఈ దర్శక నిర్మాతలకు వివేక్ మృతి ఊహించని షాక్. వీటితో పాటు మరో అరడజను సినిమాల్లో కూడా వివేక్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పుడు అన్ని సినిమాల్లో ఇతర నటులను పెట్టి రీ షూట్ చేసుకోవాల్సిన పరిస్థితి. మొత్తానికి ఇలా ఒకటీ రెండు కాదు 10 సినిమాలకు పైగా వివేక్ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఈయన హఠాన్మరణంతో ఆ సినిమాల భవిష్యత్తు సందిగ్దంలో పడింది.
ఇవి కూడా చదవండి..
సినిమాటోగ్రాఫర్ పెళ్లి వేడుకలో సందడి చేసిన కీర్తి సురేష్
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…
మమతామోహన్ దాస్ రీఎంట్రీ..ఫస్ట్ లుక్ పోస్టర్
రకుల్ పింక్, బ్లాక్ అవుట్‌ఫిట్ అందాలు అదరహో..!…
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…
కోతి కొమ్మచ్చి థీమ్ సాంగ్ అదిరింది..వీడియో
ఇండియన్ 2 నుంచి కీలక అప్డేట్..!
ఉప్పెన డైరెక్టర్ తో తారక్..రెమ్యునరేషన్ హాట్ టాపిక్..!
రజనీకాంత్ అన్నాత్తే షూటింగ్‌కు కర్ఫ్యూ కష్టాలు…
హీరోయిన్ సరదా తీర్చేశాడు..షాకిచ్చాడు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

