ఏంటి.. మహేశ్ బాబు బిజినెస్ మేన్ సినిమా వచ్చి అప్పుడే పదేళ్లైపోయిందా..? కాలం ఇంత వేగంగా వెళ్లిపోతుందా..? అస్సలు తెలియట్లేదే అనుకుంటున్నారు కదా..? నిన్నగాక మొన్న వచ్చినట్లు అనిపించే బిజినెస్‌మేన్ సినిమా వచ్చి పదేండ్లు పూర్తయిపోయింది. 2012 జనవరి 13న విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. మహేశ్ బాబుతో రెండోసారి పని చేసిన దర్శకులు హిట్ ఇవ్వరు అనే బ్యాడ్ సెంటిమెంట్ కు బ్రేక్ చెప్తూ.. పూరీ జగన్నాథ్ వరసగా రెండో విజయం అందించాడు. పోకిరి తర్వాత చేసిన బిజినెస్ మేన్ తో మరోసారి థియేటర్స్‌లో రచ్చ చేసారు. అప్పటికే దూకుడుతో సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ కొట్టిన మహేశ్.. సంక్రాంతికి వచ్చి బిజినెస్‌మేన్‌తో మరో హిట్ అందుకున్నాడు. ఈ సినిమాను కేవలం 80 రోజుల్లోనే పూర్తి చేసి ఔరా అనిపించాడు పూరీ జగన్నాథ్. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. పూరీ మార్క్ స్క్రీన్ ప్లేతో పాటు డైలాగ్స్ కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. బిజినెస్‌మేన్ పదేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫుల్ కలెక్షన్స్ ఓ సారి చూద్దాం..
నైజాం: 12.40 కోట్లు
సీడెడ్: 5.70 కోట్లు
ఉత్తరాంధ్ర: 3.40 కోట్లు
ఈస్ట్: 3.10 కోట్లు
వెస్ట్: 2.50 కోట్లు
గుంటూరు: 3.70 కోట్లు
కృష్ణా: 2.25 కోట్లు
నెల్లూరు: 1.35 కోట్లు
ఏపీ-తెలంగాణ టోటల్: 34.40 కోట్లు
ఓవర్సీస్: 3.50 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: 2.50 కోట్లు
వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్: 40.40 కోట్లు షేర్
దూకుడు లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత విడుదలైన సినిమా కావడంతో బిజినెస్‌మేన్‌కు రూ.37 కోట్ల బిజినెస్ జరిగింది. అప్పటికి తెలుగు సినిమాలకు ఇది పెద్ద బిజినెస్. అయినా కూడా ఓపెనింగ్స్ కుమ్మేసింది బిజినెస్‌మేన్. మాస్ ఆడియన్స్ ఈ సినిమాతో పండగ చేసుకున్నారు. ఫలితంగా ఫుల్ రన్లో రూ.40.40 కోట్ల షేర్ వసూలు చేసింది. బయ్యర్లకు రూ.3.40 కోట్ల లాభాలను అందించింది. సినిమా రీజనబుల్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని చాలా చోట్ల నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. గతేడాది అనారోగ్యంతో మరణించిన నిర్మాత ఆర్ఆర్ వెంకట్ హై బడ్జెట్‌తో బిజినెస్ మేన్ సినిమాను నిర్మించాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అన్నయ్యకు జ్వరం వస్తేనే తట్టుకోలేకపోయాడు.. మహేశ్ బాబు గురించి త్రివిక్రమ్ షాకింగ్ నిజం..
Ramesh babu | మొదటి సినిమాకే బాలయ్యతో వివాదం..
Mahesh | మరో జన్మంటూ ఉంటే.. అప్పుడూ నువ్వే నా అన్నయ్య: సోదరుడి మృతిపై మహేశ్ ట్వీట్
పుష్ప సినిమా కోసం సుకుమార్ ముందు అనుకున్నది అల్లు అర్జున్ను కాదంట