Bunny Vasu| బాలీవుడ్ స్టార్ యాక్టర్ విక్కీ కౌశల్ (Vicky Kaushal) నటించిన చిత్రం ఛావా. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కాగా ఈ చిత్రం తెలుగులో మార్చి 7న విడుదల కాబోతుంది. తెలుగులో ఈ చిత్రాన్ని పాపులర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ విడుదల చేస్తోంది.
కాగా తెలుగు వెర్షన్‌కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడంటూ నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బన్నీ వాసు క్లారిటీ ఇచ్చాడు. ఈ వార్తలపై స్పందిస్తూ.. తాను ఆ వార్తలు చూసి షాకయ్యానన్నాడు బన్నీ వాసు. మేము తారక్‌ను సంప్రదించలేదు. ఎందుకంటే వారం రోజుల క్రితమే ఛావా రిలీజ్ హక్కులు సొంతం చేసుకున్నాం. ఇంత తక్కువ టైంలో స్టార్లను ఇబ్బంది పెట్టాలని ఎవరూ అనుకోరు. అందువల్లే డబ్బింగ్ ఎక్స్‌పర్ట్స్‌తో తెలుగులో డబ్బింగ్ చెప్పించామన్నాడు.
ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్(Lakshman Utekar) దర్శకత్వం వహించగా.. మ్యాడ్‌డాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేశ్ విజన్ నిర్మించారు. మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్(Chatrapathi Shivaji Maharaj) పెద్ద కుమారుడు శంభాజీ మహరాజ్(Shambaji MAharaaj) జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ఈ చిత్రంలో. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది.
Posani Krishna Murali | పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్.. రాజంపేట జైలుకు తరలింపు