బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Oct 07, 2020 , 16:58:45

కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డిని క‌లిసిన పాయ‌ల్ ఘోష్

కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డిని క‌లిసిన పాయ‌ల్ ఘోష్

బాలీవుడ్ న‌టి పాయ‌ల్ ఘోష్ ఇవాళ‌ కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డిని క‌లిశారు. త‌నకు స‌త్వ‌ర న్యాయం జ‌రిగేలా చూడాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తూ  కిష‌న్ రెడ్డికి పాయ‌ల్ లేఖ అంద‌జేశారు. ఇది చాలా మంది ఎదుర్కొంటున్న స‌మ‌స్య అని, ఇపుడు చ‌ర్య‌లు తీసుకునే స‌మ‌యం వ‌చ్చింద‌ని ట్వీట్ లో పేర్కొన్నారు పాయ‌ల్‌. బాలీవుడ్ న‌టి పాయ‌ల్ ఘోష్ ద‌ర్శ‌కుడు అనురాగ్ కా‌శ్య‌ప్ పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.  పాయ‌ల్ ఘోష్ ఫిర్యాదు మేర‌కు ముంబై పోలీసులు అనురాగ్ కాశ్య‌ప్ పై అత్యాచారం కేసు న‌మోదు చేశారు.

ఈ కేసులో అనురాగ్ కాశ్య‌ప్ ను  పోలీసులు సుమారు 8 గంటలు విచారించారు. పాయ‌ల్ త‌న‌పై చేస్తున్న ఆరోప‌ణలు నిరాధార‌మైన‌వ‌ని అనురాగ్ ఇప్ప‌టికే తీవ్రంగా ఖండించాడు. ఈ కేసులో త‌న‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ పాయ‌ల్ మంగ‌ళ‌వారం ఢిల్లీలోని జాతీయ మ‌హిళా క‌మిష‌న్ ను ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo