Bro Second Single | బ్రో నుంచి సాయిధరమ్ తేజ్, కేతిక శర్మ జానవులే సాంగ్ అప్డేట్
Bro Second Single | పవన్ కల్యాణ్ (Pawan Kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం బ్రో (Bro The Avatar). ఎస్ థమన్ టీం ప్రమోషన్స్ లో భాగంగా ముందుగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం ఒక్కో పాటను లాంఛ్ చేస్తూ..మ్యూజికల్ బ్లాస్ట్ ఇస్తోంది. తాజాగా బ్రో నుంచి సెకండ్ సింగిల్ జానవులే అప్డేట్ ఇచ్చారు.
Bro Second Single | టాలీవుడ్ సినీ జనాలు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న ఒకటి బ్రో (Bro The Avatar). పవన్ కల్యాణ్ (Pawan Kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జులై 28న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో ఎస్ థమన్ టీం ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ముందుగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం ఒక్కో పాటను లాంఛ్ చేస్తూ..మ్యూజికల్ బ్లాస్ట్ ఇస్తోంది.
మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన బ్రో ఫస్ట్ సింగిల్ మై డియర్ మార్కండేయ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. తాజాగా బ్రో నుంచి సెకండ్ సింగిల్ జానవులే అప్డేట్ ఇచ్చారు. మీ మనస్సును రంజింపజేసే రొమాంటిక్ మెలోడి జానవులే లిరికల్ వీడియో (Jaanavule Song)ను జులై 15న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. సాయిధరమ్ తేజ్, కేతిక శర్మ రొమాంటిక్ యాంగిల్లో స్టైలిష్‌గా కనిపిస్తున్న సాంగ్ లుక్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
సముద్రఖని (Samuthirakani) డైరెక్ట్ చేస్తున్న బ్రో టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన బ్రో ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్, టైమ్ లైన్, పవన్ కల్యాణ్ మధ్య సాగే ఘటనల నేపథ్యంలో బ్రో స్టోరీ ఉండబోతున్నట్టు టీజర్‌తో క్లారిటీ ఇచ్చాడు సముద్రఖని. ఈ మూవీలో ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తన్నారు. రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్లభరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
బ్రో చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూచిబొట్ల కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు అందిస్తున్నారు.
Get ready to immerse yourself in the symphony of love 🎶👩❤️👨#Jaanavule – #BroTheAvatar 2nd Single Lyrical Video on July 15th 📣
Stay tuned to @MangoMusicLabel 🎧@PawanKalyan @IamSaiDharamTej @TheKetikaSharma @thondankani @MusicThaman @vishwaprasadtg @vivekkuchibotla… pic.twitter.com/Nk7vIu0jBr
— People Media Factory (@peoplemediafcy) July 12, 2023
బ్రో టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

