మెట్రో.. ఫుల్ రష్
వరుసగా మూడు రోజుల సెలవులు, ఎన్నికల హడావిడి ముగియడంతో మంగళవారం తెల్లవారు జాము నుంచే నగరంలో మెట్రో సర్వీసుల కోసం క్యూ కట్టారు. తెలుగు రాష్ర్టాల్లో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో.. హైదరాబాద్కు వచ్చే వారితో పాటు నగరంలోని ప్రధాన మెట్రో స్టేషన్లు కిటకిటలాడాయి.
- మూడ్రోజుల సెలవుల తర్వాత ఒక్కసారిగా పెరిగిన ప్రయాణికులు
- కిక్కిరిసిన ప్రయాణికులతో రోజంతా రద్దీ
- ఉదయం 5.30 గంటల నుంచే అందుబాటులోకి మెట్రో రైలు..
సిటీబ్యూరో, మే 14(నమస్తే తెలంగాణ): వరుసగా మూడు రోజుల సెలవులు, ఎన్నికల హడావిడి ముగియడంతో మంగళవారం తెల్లవారు జాము నుంచే నగరంలో మెట్రో సర్వీసుల కోసం క్యూ కట్టారు. తెలుగు రాష్ర్టాల్లో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో.. హైదరాబాద్కు వచ్చే వారితో పాటు నగరంలోని ప్రధాన మెట్రో స్టేషన్లు కిటకిటలాడాయి. ముఖ్యంగా ఏపీ నుంచి వచ్చే వారితో ఎల్బీనగర్, ఉప్పల్ మెట్రో స్టేషన్లతోపాటు, సికింద్రాబాద్ మెట్రో స్టేషన్లకు భారీగా ప్రయాణికులు చేరుకున్నారు. సెలవులు ముగియడంతో ఉద్యోగరీత్యా ఇండ్లకు చేరుకునేందుకు మెట్రోను ఆశ్రయించినట్లు మెట్రో వర్గాలు పేర్కొన్నాయి. అయితే నగరానికి వచ్చే వారిని దృష్టిలో పెట్టుకుని ఉదయం 5.30గంటల నుంచి సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చింది.
దీంతో మంగళవారం తెల్లవారుజాము నుంచే నగరంలోని ప్రధాన మెట్రో స్టేషన్లు, బస్ స్టేషన్లతో పాటు, రైల్వే జంక్షన్లు కూడా వచ్చిపోయే ప్రయాణికులతో నిండి ఉన్నాయి. ఇక మంగళవారం ఆఫీసులకు వెళ్లే వారితో మెట్రోకు ప్రయాణికుల సంఖ్య పెరిగినట్లు తెలిసింది. గత నాలుగు రోజులు జనాలు లేకపోవడంతో బోసిపోయి ఉన్న మెట్రో స్టేషన్లు, ఒక్కసారిగా రద్దీగా మారిపోయాయి. అదే సమయంలో మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో జనాలు నిండిపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి నగరానికి చేరుకుని, ఇక్కడి నుంచి ఇండ్లకు చేరుకునేందుకు మెట్రోను ఆశ్రయించిన వారే ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం నగరంలో ఆటో, క్యాబ్ ధరలతో పోల్చితే మెట్రో ద్వారా తక్కువ ఖర్చులో ప్రయాణించే వీలు ఉండటంతో రద్దీ పెరగడానికి కారణాలు చెబుతున్నారు. ప్రధాన మార్గాల్లోనూ మెట్రోకు ఆదరణ వస్తుండగా.. క్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నట్లు మెట్రో గణాంకాల్లోనూ తేలింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

