ఈరోజుల్లో ఇంట్లో వాడేవన్నీ స్మార్ట్ వస్తువులే. అన్నీ సెన్సర్‌తో పనిచేస్తూ ఎక్కడనుంచైనా ఆపరేట్ చేసేందుకు వీలుగా వచ్చేస్తున్నాయి. టీవీలు, ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, లైట్లు.. ఇలా ఇంట్లో అన్ని వస్తువులూ రిమోట్‌తో పనిచేస్తున్నప్పుడు కొవ్వొత్తులు వెలిగించాలంటే మాత్రం అగ్గిపెట్టనే ఎందుకు వాడాలి? అందుకే రిమోట్‌తో ఆన్‌చేసే క్యాండిల్స్ అందుబాటులోకి వచ్చేశాయి. వీటిని చార్జ్ చేసి పెడితే చాలు అవసరమైనప్పుడు రిమోట్ నొక్కితే చాలు ఇంటినిండా వెలుగులు చిమ్ముతాయి.
ఈ రిమోట్ క్యాండిల్స్ చూసేందుకు మామూలు క్యాండిల్స్లానే కనిపిస్తాయి. కానీ వీటిలో బ్యాటరీలు ఉండి చార్జ్ చేసేందుకు యూఎస్బీ పోర్ట్ కలిగి ఉంటాయి. రంగురంగుల మైనంతో చేసిన క్యాండిల్స్ మాదిరిగానే ఈ రిమోట్ క్యాండిల్స్లోనూ రంగురంగుల కాంతిని వెదజల్లేవి అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు రిమోట్ సాయంతో ఒకే క్యాండిల్‌లో మనకు నచ్చిన కలర్ కాంతిని సెట్ చేసుకోవచ్చు. రిమోట్ సాయంతో టీవీలో ఛానళ్లు మార్చినట్లే ఈ క్యాండిల్స్‌లో రంగులు మార్చేయవచ్చన్నమాట!