బాలీవుడ్ (Bollywood)లో తెరకెక్కుతున్న క్రేజీ సినిమాల్లో ఒకటి బ్రహ్మాస్త్ర (Brahmastra). అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ ప్రాజెక్టులో బాలీవుడ్ తారాగణం రణ్ బీర్ కపూర్ (Ranbir kapoor), అలియాభట్, అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), మౌనీరాయ్, టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు ఇటీవలే ఓ అప్ డేట్ కూడా బయటకు వచ్చింది. బ్రహ్మాస్త్ర చిత్రం 2022 సెప్టెంబర్ 9న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. బ్రహ్మాస్త్ర చిత్రాన్ని ఇదివరకెన్నడూ లేని విధంగా 10 టీజర్లు, 13 మోషన్ పోస్టర్లతో గ్రాండ్‌గా ప్రమోట్ చేసే ప్లాన్ రెడీ చేశారు దర్శనిర్మాతలు.
ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిలింనగర్, బీటౌన్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఢిల్లీలో జరిగిన ఫ్యాన్ ఈవెంట్లో బ్రహ్మాస్త్ర మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. దీంతోపాటు ఈ చిత్రయూనిట్ హైదరాబాద్‌లో స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేసింది టీం. శనివారం నగరంలో స్పెషల్ మీడియా ఈవెంట్‌ను నిర్వహించనుండగా..ఈవెంట్లో ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజమౌళి (SS RAJAMOULI) సందడి చేయబోతున్నాడు.మొత్తానికి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ నుంచి కొంత బ్రేక్ తీసుకున్న రాజమౌళి ఏ మాత్రం టైం వృథా చేయకుండా ఇతర సినిమాలను కూడా ప్రమోట్ చేస్తూ బిజీగా మారిపోయాడని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, రణ్ బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా బ్రహ్మాస్త్ర చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళం, బెంగాలీ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Pushpa Five Shows | అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘పుష్ప’ ఐదో షోకు అనుమతి
Rakul Preet Singh Christmas | రకుల్ ఈ సారి ఎవరితో క్రిస్మస్ చేసుకోబోతుందంటే..?
Pushpa Five Shows | అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘పుష్ప’ ఐదో షోకు అనుమతి
Varalaxmi Joins Yashoda | క్రేజీ అప్డేట్..’యశోద’తో జాయిన్ అయిన ‘జయమ్మ’