Brahmanandam| సాధారణంగా స్టార్ హీరోలు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటూ ఆస్తులు కూడబెట్టుకుంటూ ఉంటారు. అయితే కొందరు దురలవాట్ల వలన ఆస్తులు పోగొట్టుకోవడం కూడా జరిగింది. కాని హీరోలని మించి భారీ ఆస్తులు కూడబెట్టుకొని దేశంలోనే అత్యంత ధనిక కమెడియన్‌గా నిలిచారు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం.. రోజుకు రూ.లక్ష తీసుకునే బ్రహ్మానందం ఒక్కోసారి కాల్షీట్లను బట్టి సినిమాకు కోటిరూపాయల పారితోషికం తీసుకోవడం కూఆ జరిగిందట. అప్పట్లో బ్రహ్మానందం లేనిది సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. ఇటీవల బ్రహ్మీ హవా ప్రస్తుతం తగ్గింది. తగ్గింది అనేకన్నా ఆయనే తగ్గించుకున్నారు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఏ సినిమా పడితే అది చేయకుండా కాస్త ఆచితూచి సినిమాలు చేస్తున్నారు.
అయితే లెక్చరర్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి మోస్ట్ వాంటెడ్ కమెడియన్‌గా ఎదిగిన బ్రహ్మానందం అతి తక్కువ టైంలో ఏకంగా వెయ్యికి పైగా సినిమాలలో నటించి గిన్నిస్ రికార్డులోకి ఎక్కారు.బ్రహ్మానందం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ విలాసవంతమైన ఇంట్లో నివసిస్తున్న బ్రహ్మీకి సొంతూరు సత్తెనపల్లెలో అయిదు కోట్ల విలువైన ఆస్తి ఉందని సమాచారం. చాలా రియల్ ఎస్టేట్ లలో కూడా ఆయన బాగానే ఆస్తులను కూడబెట్టారని చెబుతుంటారు. మొత్తం ఆయన ఆస్తి విలువ సుమారుగా రూ. 500 కోట్లు వరకు ఉంటుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటూ ఉంటారు.
బ్రహ్మానందం దగ్గర ఆడి R8, ఆడి Q7, బ్లాక్ లగ్జరీ మెర్సిడెస్-బెంజ్ వంటి కార్లతోపాటు అనేక కంపెనీల కార్లు కూడా ఉన్నాయి. ఎలాంటి దుబారా ఖర్చు చేయకుండా ప్రతి రూపాయిని పొదుపు చేసుకుంటూ రావడంవల్ల బ్రహ్మానందం ఆస్తుల విలువ ప్రస్తుతం రూ.500 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. స్టార్ హీరోలు రణబీర్ కపూర్ (350 కోట్లు), ప్రభాస్ (300 కోట్లు), రజనీకాంత్ (400 కోట్లు) వంటి అగ్రశ్రేణి నటుల కంటే కూడా బ్రహ్మానందం ఎక్కువ ఆస్తులు సంపాదించినట్టు పలు వెబ్ సైట్స్ తెలియజేశాయి. భారతదేశంలోని ఇతర ప్రముఖ హాస్యనటలు ఎవరూ కూడా బ్రహ్మానందంకు దగ్గరగా రాలేకపోయారు. బాలీవుడ్ కమెడీయన్ కపిల్ శర్మ నికర విలువ మాత్రం 300 కోట్లుగా నివేదించబడింది అని అంటున్నారు.