Bommarillu Re-Release | కోలీవుడ్ నటుడు సిద్దార్థ్, జెనీలియా జంటగా నటించిన బ్లాక్ బస్టర్ క్లాసిక్ చిత్రం ‘బొమ్మరిల్లు’ (Bommarillu). సిద్దార్థ్, జెనీలియా దర్శకుడు భాస్కర్‌తో పాటు టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు కెరీర్లో మర్చిపోలేని చిత్రాలలో ఇది ఒకటి. 2006లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అందుకుంది. భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రం యువతకు బాగా కనెక్ట్ అవ్వడంతో పాటు థియేటర్లో 100 రోజులు ఆడిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాతోనే దర్శకుడు భాస్కర్ ‘బొమ్మరిల్లు భాస్కర్’గా మారాడు. అయితే ఈ సినిమా రేపు రీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మూవీకి సంబంధించిన విషయాలను దర్శకుడు భాస్కర్ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.
ఈ సినిమా షూటింగ్లో భాగంగా భాస్కర్ మీదా కోపంతో జెనీలియా వెళ్లిపోయినట్లు భాస్కర్ చెప్పుకోచ్చాడు. ఈ సినిమా మొదటిరోజు షూటింగ్లో ఐస్‌క్రీమ్ సీన్ షూట్ చేశాం. జెనీలియా, సిద్దార్థ్ అప్పుడే వచ్చి జాయిన్ అయ్యారు. ఈ సీన్లో తింటావా అనే ఒక డైలాగ్ ఉంది. అయితే ఈ సీన్ కోసం రాత్రి 10 గంటలకు మొదలుపెడితే తెల్లవారేవరకు తీశాం. కనీసం 35 టేక్‌లు తీసుకున్నాను. దీంతో జెనీలియా కోపంతో నా దగ్గరికి వచ్చి ఎంటి రెండు ముక్కల డైలాగ్ చెప్పలేనా నేను అంటూ నేను ఈ సినిమా చేయను అంటూ వెళ్లిపోయింది. అయితే ఆ రోజు షూటింగ్‌కు అల్లు అర్జున్ వచ్చాడు. తానే జెనీలియా దగ్గరికి వెళ్లి అలా చేయకు. ఇది మంచి సినిమా, మంచి దర్శకుడు మొదటిరోజే జడ్జ్ చేయకు.. ఈ సినిమా చేయి అంటూ తనను ఒప్పించాడు అంటూ భాస్కర్ చెప్పుకోచ్చాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ఆ రెండు తెల్లవారే వరకు తీశాను.. దాంతో ఫ్రస్టేట్ అయిపోయింది. అప్పుడు #AlluArjun నచ్చచెప్పాడు. – #BommarilluBhaskar
Watch Full Interview https://t.co/GDOCET6HNK pic.twitter.com/hYP0VzX0Wl
— Rajesh Manne (@rajeshmanne1) September 20, 2024
Also Read..