బాలీవుడ్ (Bollywood) హీరో జాన్ అబ్రహాంతోపాటు అతడి భార్యకు కరోనా సోకింది. తన సతీమణి ప్రియా రూంచల్ (Priya Runchal)కు కోవిడ్-19 పాజిటివ్ (Covid-19)గా నిర్దారణ అయిందని జాన్ అబ్రహాం ఇన్ స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలియజేశాడు. మూడు రోజుల క్రితం ఓ వ్యక్తిని కలిశా. ఆ తర్వాత అతడికి కోవిడ్ పాజిటివ్ ఉన్నట్టు తెలిసింది. ప్రియా, నేను పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ అని తేలింది. మేమిద్దరం హోంక్వారంటైన్ అయ్యాం. మేము ఎవరి కాంటాక్ట్‌లోకి వెళ్లడం లేదని చెప్పాడు.
తమకు ఉన్న లక్షణాల గురించి కూడా చెప్పుకొచ్చాడు జాన్ అబ్రహాం. మేమిద్దరం వ్యాక్సిన్ వేయించుకున్నాం. కొన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి. దయచేసి అందరూ మాస్కులు తప్పనిసరిగా పెట్టుకుని..ఆరోగ్యంగా ఉండండి అంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులు, ఫాలోవర్లకు విజ్ఞప్తి చేశాడు జాన్ అబ్రహాం. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని, సోషల్ డిస్టేన్స్ ను పాటించాలని ఇప్పటికే సర్కులర్ జారీచేశాయి.