Kanika Kapoor | రెండో పెండ్లి చేసుకున్న బాలీవుడ్ సింగర్ కనికా కపూర్
Bollywood Singer Kanika Kapoor Second Marriage | బాలీవుడ్ స్టార్ సింగర్ కనికా కపూర్ రెండో వివాహం చేసుకుంది. 43 ఏండ్ల వయసులో లండన్‌కు చెందిన వ్యాపారవేత్త గౌతమ్ హతిరమన్ను పెండ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. శుక్రవారం లండన్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ పెండ్లికి హాజరైన సింగర్ మన్మీత్ సింగ్ నూతన దంపతులతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మీరెంత అందంగా ఉన్నారో.. మీ జర్నీ కూడా అంతే ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానని కూడా రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ పెండ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సింగర్ కనికా కపూర్‌కు 1998లో ఎన్నారై బిజినెస్‌మ్యాన్ రాజ్ చందోక్‌ను పెండ్లి చేసుకుని లండన్‌లో సెటిల్ అయ్యింది. అప్పటికి ఆమె వయసు కేవలం 18 ఏండ్లు మాత్రమే. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. అయితే మనస్పర్థలు రావడంతో 2012లో మొదటి భర్తతో విడిపోయిన కనికా కపూర్ లక్నోకు తిరిగి వచ్చేసింది. ఆ తర్వాత బాలీవుడ్లో సింగర్‌కు మంచి పేరు తెచ్చుకుంది. ఆమె పాడిన బేబీ డాల్, చిట్టియక్కలాయాన్, జెండా పూల్ పాటలు జనాలను ఉర్రూతలూగించాయి. ఇటీవల పుష్పలో ఊ అంటావా.. ఊఊ అంటావా హిందీ వర్షన్ ఊ బొలేగా క్యా ఊఊ బోలేగాతో ఆకట్టుకుంది. తాజాగా లండన్‌కు చెందిన మరో బిజినెస్‌మ్యాన్‌ను పెండ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. ఈమె పెండ్లి వార్త తెలిసి చాలామంది కనికా కపూర్‌కు విషెస్ చెబుతున్నారు. అయితే 42 ఏండ్ల వయసులో మళ్లీ పెండ్లి చేసుకోవడం ఏంటని పలువురు విమర్శలు కూడా చేస్తున్నారు.

Read More :
కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో దీపిక ధరించిన నెక్లెస్ ధరెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే
Sivakarthikeyan 21st film | శివకార్తికేయన్ హీరో..కమల్‌హాసన్ నిర్మాత..ఇంట్రెస్టింగ్ టైటిల్
Seema Khan | అధికారికంగా విడాకులు..మాజీ భర్త పేరు తొలగించిన సీమా
Mahesh Babu | మహేశ్‌బాబు గురించి ఎవరికీ తెలియని విషయాలు..చాటింగ్ వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

