కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy)దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శివకార్తికేయన్ 21వ ప్రాజెక్టుగా వస్తున్న ఈ మూవీని యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan)నిర్మిస్తుండటం విశేషం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాకు మావీరన్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇటీవలే ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఉదయనిధి స్టాలిన్ సినిమా టైటిల్ ఏంటో చెప్పాడు.
ఇక ఈ ప్రాజెక్టులో శివకార్తికేయన్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపింబోతున్నాడట. దీనికి సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కోలీవుడ్ భామ సాయిపల్లవి ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. రాజ్ కమల్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హరీశ్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు. మరిన్ని వివరాలపై త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నారు మేకర్స్.