మెగాబ్రదర్ నాగబాబు కూతురు, నటి నిహారిక కొణిదెల (Niharika Konidela) ఇటీవలే ఇన్స్టాగ్రామ్ ఖాతాలోకిరీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా తన భర్త చైతన్య జొన్నల గడ్డ (Chaitanya JV)తో కలిసి దిగిన ఫొటోను చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అయితే ఈ కపుల్ అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ లిప్ లాక్ స్టిల్‌తో నెట్టింట హల్ చల్చేస్తున్నారు. నిహారిక భర్త చైతన్యను లిప్ లాక్ (Niharika Chaitanya lip lock) చేసిన స్టిల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ..ఎప్పటికీ విడదీయలేని బంధం..ఐ లవ్ యూ చైతన్య అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ఇపుడీ ఫొటో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. నిహారిక-చైతన్య ఇంతకీ ఎక్కడికి వెళ్లారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. నిహారిక చివరగా 2019లో వచ్చిన సూర్యకాంతం, చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాల్లో మెరిసింది. 2021లో వెబ్ సిరీస్‌ను కూడా ప్రొడ్యూస్ చేసింది. చైతన్య-నిహారిక వెడ్డింగ్ 2020 డిసెంబర్ 9 ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌విలాస్ ప్యాలెస్‌లో గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే.