ఎన్టీఆర్ (Jr NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబోలో జనతాగ్యారేజ్ తర్వాత మరో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 30 (NTR 30)గా వస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎక్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను స్టూడెంట్ యూనియన్ లీడర్‌గా చూపించే పొలిటికల్ సినిమా తీయాలని కొరటాల అనుకున్నారు. అయితే మెసేజ్‌లు ఇవ్వడంలో పాపులర్ అయిన కొరటాల..ఇపుడు సందేశాలను ఇస్తే రిసీవ్ చేసుకునే మూడ్‌లో లేరని, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ లాంటి ఎంటర్టైన్మెంట్ కావాలని సినీ జనాలు కోరుకుంటున్నారట.
కొరటాల ప్రస్తుతం బృందావనం సినిమాలాగే భారీ మాస్ ఎలిమెంట్స్, ఎలివేషన్స్, అద్భుతమైన డైలాగ్‌లతో కూడిన స్క్రిప్ట్‌తో రెడీ అవుతున్నాడని అంటున్నారు. ఇక ఎన్టీఆర్ 30వ ప్రాజెక్టుతో ఇవ్వాలనుకుంటున్న సందేశం గురించి కొరటాల అసోసియేట్స్ అతనిని అడుగగా..’ఈసారి మెసేజ్ ఏం లేదమ్మా. మాస్ అంతే’..అని చెబుతున్నాడట. ఈ లెక్కన కొరటాల తనలోని పక్కా మాస్ డైరెక్టర్ని బయటపెట్టేందుకు రెడీ అవుతున్నట్టు తెలిసిపోతుంది.
మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య లాంటి డిజాస్టర్ చూసిన కొరటాల..ఇక ఇప్పటి నుంచి మెసేజ్ ఓరియెంట్ సినిమాలకు గుడ్ బై చెప్పి..కొత్త రూటులో వెళ్తాడా..? అనేది రానున్న రోజుల్లో తెలిసిపోతుంది. తారక్‌ను కొరటాల ఎలా చూపించబోతున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.