విశ్వాసం, పెద్దన్న, ఈటీ లాంటి సూపర్ హిట్ సినిమాలతోపాటు మరెన్నో తమిళ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా కోలీవుడ్‌లో వన్ ఆఫ్ ది లీడింగ్ పొజిషన్లో ఉన్నాడు ఇమ్మాన్ (D Imman). ఈ స్టార్ మ్యూజిక్ కంపోజర్ 2021 డిసెంబర్లో తన మొదటి భార్య మోనికా రిచర్డ్ (Monicka Richard)నుంచి విడిపోయిన విషయం తెలిసిందే. తాజాగా మరో పెళ్లి చేసుకున్నాడు ఇమ్మాన్. దివంగత కోలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ ఉబల్ద్ కూతురు అమేలీ (Amelie)ని పెళ్లి చేసుకున్నాడు.
వెడ్డింగ్ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సీనియర్ నటి సంగీత వెడ్డింగ్‌కు హాజరై..వధూవరులను ఆశీర్వదించింది. ఇమ్మాన్-అమేలీ కపుల్ వెడ్డింగ్ ఫొటో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇమ్మాన్ తమిళ మ్యూజిక్ డైరెక్టరే అయినా తెలుగులో కూడా ఆయన మ్యూజిక్‌ను సంగీత ప్రియులు చాలా ఎంజాయ్ చేస్తుంటారు. విశాల్-లక్ష్మిమీనన్ కాంబోలో వచ్చిన పల్నాడు, విజయ్-మోహన్ లాల్ నటించిన జిల్లా, అమలాపాల్-విధార్త్ నటించిన ప్రేమఖైదీ చిత్రాలతో మరెన్నో హిట్ సినిమాలకు సంగీతం అందించాడు ఇమ్మాన్.