ఎస్ఎస్ రాజమౌళి-ప్రభాస్ కాంబోలో వచ్చిన చిత్రం ఛత్రపతి (Chatrapathi). ఈ బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ సినిమా 16 ఏళ్ల తర్వాత బాలీవుడ్ (Bollywood )లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ (Tollywood ) యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) ఈ రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాతో బీటౌన్ ఎంట్రీ ఇస్తున్నాడు బెల్లంకొండ. జక్కన్న సమక్షంలో గ్రాండ్‌గా మొదలైన ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి కొంత కాలంగా ఎలాంటి అప్ డేట్స్ బయటకు రాలేదు. అయితే తాజాగా మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందించారు.
వివి వినాయక్ (VV Vinayak) డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ నుస్రత్ బరూచా (Nushrratt Bharuccha) ఫీ మేల్ లీడ్ రోల్‌కు ఎంపికైంది. డ్రీమ్ గర్ల్, ఛోరీ సినిమాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ భామ. సుస్రత్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న తాజా ప్రాజెక్టులో హీరోయిన్గా ఫైనల్ చేసినట్టు తెలిపారు మేకర్స్. పెన్ మూవీస్ అండ్ పెన్ మరుధుర్ సినీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతుంది.
సహిల్ వైద్, అమిత్ నాయర్, రాజేంద్ర గుప్త, శివమ్ పాటిల్, వేదిక, స్వప్నిల్ ఈ చిత్రంలో కీ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జయంతిలాల్ గడ నిర్మిస్తున్నారు. బెల్లంకొండ సినిమాలకు హిందీలో మంచి క్రేజ్ ఉంటుంది. ఇప్పటివరకు తెలుగు సినిమాలతో ఎంటర్టైన్ చేసిన ఈ హీరో నార్తిండియా ఆడియెన్స్ ను డైరెక్ట్ హిందీ మూవీతో ఎలా అలరిస్తాడో చూడాలి మరి.