Deepika Padukune Necklace | కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ( Cannes film Festival ) సినిమా వాళ్లకు అతిపెద్ద పండుగ. వివిధ దేశాల తారలంతా అక్కడి రెడ్‌కార్పెట్ మీద తళుక్కున మెరుస్తారు. ఆ వేడుక కోసం ప్రత్యేకమైన దుస్తులు, ఆకర్షణీయమైన నగలు ధరిస్తారు. బాలీవుడ్ తార దీపికా పదుకొనె కేన్స్ సినిమా అవార్డుల జ్యూరీలోనూ సభ్యురాలే. ఈ పండుగ సందర్భంగా ఆమె ధరించిన వజ్రాల నెక్లెస్ అందరి దృష్టినీ ఆకర్షించింది.
నలుపు రంగు సూట్తరహా డ్రెస్‌మీద.. తాతమ్మల కాలంనాటి కంటెను తలపించేలా ఉందా నగ. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ నగల తయారీ సంస్థ కార్టియర్ దీన్ని రూపొందించింది. 18 క్యారెట్ల తెల్ల బంగారంతో తయారు చేశారు. నగకు ముందు భాగంలో రెండు పులి ముఖాలు వచ్చేలా డిజైన్ చేశారు. వాటి కళ్ల స్థానంలో ఖరీదైన పచ్చలను పొదిగారు. ఈ నెక్లెస్ ఖరీదు సుమారు మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఉండవచ్చని అంచనా.
Ghoomar Dance | కేన్స్ లో దీపికా, పూజా, తమన్నా డ్యాన్స్ చేస్తే..ట్రెండింగ్‌లో వీడియో”
“Deepika Padukone | చీరకట్టులో సొగసులు ఒలకబోస్తున్న దీపికా పదుకొణె..”
Ranbir Ex Lovers | రణ్‌బీర్ వెడ్డింగ్‌కు మాజీ గర్ల్‌ఫ్రెండ్స్..ఎవరెవరో గెస్ చేశారా..?”
Deepika Padukone | ఎల్లో కలర్ డ్రెస్‌లో దీపికా పదుకొనే అందాల ఆరబోత..”
“Deepika Padukone | పొట్టి నిక్కర్లో అందాల దీపికా పదుకొనే..”