Seema Khan | అధికారికంగా విడాకులు..మాజీ భర్త పేరు తొలగించిన సీమా
ఇటీవలే ముంబై స్పెషల్ కోర్టు సోహైల్-సీమాఖాన్కు విడాకులు (Divorce) మంజూరు చేసింది. ఈ అప్ డేట్ వచ్చిన వారం గ్యాప్‌లోనే అందరికీ సోషల్ మీడియా ద్వారా విడాకులపై పూర్తిగా క్లారిటీ ఇచ్చేసింది సీమా
బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ (Sohail Khan) తన భార్య సీమాఖాన్ (Seema Khan)కు విడాకులిచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే ముంబై స్పెషల్ కోర్టు సోహైల్-సీమాఖాన్కు విడాకులు (Divorce) మంజూరు చేసింది. ఈ అప్ డేట్ వచ్చిన వారం గ్యాప్‌లోనే అందరికీ సోషల్ మీడియా ద్వారా విడాకులపై పూర్తిగా క్లారిటీ ఇచ్చేసింది సీమా. ఇంతకీ నెట్టింట పెట్టిన పోస్ట్ విషయమేంటనే కదా మీ డౌటు.
అధికారికంగా విడాకులు తీసుకున్న నేపథ్యంలో తన పేరులోని మాజీ భర్త పేరైన ఖాన్‌ను తీసేసింది. పెళ్లికి ముందు ఉన్న సీమా కిరణ్ సజ్దే (Seema Kiran Sajdeh)పేరు పెట్టుకుంది. ఇన్ స్టా హ్యాండిల్లో ఇదే పేరు కనిపించడంతో..సోహైల్‌తో వైవాహిక బంధానికి గుడ్‌బై చెప్పేసిందని సినీ జనాలకు ఓ క్లారిటీ కూడా వచ్చేసింది. ప్యార్ కియా తో డర్నా క్యా సినిమా సెట్స్ లో తొలిసారి సీమను కలిశాడు సోహైల్ ఖాన్. ఢిల్లీకి చెందిన సీమా ఫ్యాషన్ డిజైనర్ కెరీర్‌ను ప్రారంభించి..ముంబైలో ఉండేది.
పెద్దలు ఒప్పుకోకున్నా సోహైల్ఖాన్ను 1998లో పెళ్లి చేసుకుంది సీమా. వీరిద్దరికి 2000 సంవత్సురంలో నిర్వాన్ పుట్టాడు. 2011లో రెండో కుమారుడు యోహాన్ సరోగసీ ద్వారా పొందారు. సల్మాన్ ఖాన్ మరో సోదరుడు అర్బాజ్ ఖాన్ కూడా తన భార్య మలైకా అరోరాకు విడాకులు ఇచ్చేశాడు. సల్లూభాయ్ ఫ్యామిలీలో ఇలా విడాకుల పర్వం నడుస్తుండటం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

