తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, పి వాసు (P Vasu) కాంబినేషన్లో తెరకెక్కిన చంద్రముఖి చిత్రానికి సీక్వెల్ వస్తోన్న సంగతి తెలిసిందే. రాఘవా లారెన్స్ (Raghava Lawrence) లీడ్ రోల్లో చంద్రముఖి 2 (Chandramukhi 2)చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తోంది. కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) కీ రోల్ పోషిస్తుండగా.. ఇప్పటికే ఫ్యాన్స్ క్రియేట్ చేసిన కంగనా లుక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
తాజా అప్డేట్ తెరపైకి వచ్చింది. చంద్రముఖి 2 సెట్స్‌లో జాయిన్ అయింది కంగనా. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ప్రీక్వెల్ పార్టులో జ్యోతిక పోషించిన పాత్రలో మెరవనుంది కంగనారనౌత్. తమ అభిమాన హీరోయిన్ ఈ ఐకానిక్ రోల్లో ఎలా కనిపించబోతుందని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు కంగనా ఫ్యాన్స్, ఫాలోవర్లు.
ఇప్పటికే మేకర్స్ ఈ సినిమాను ప్రకటిస్తూ.. విడుదల చేసిన టైటిల్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రంలో లెజెండరీ కమెడియన్ వడివేలు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు.
Read Also :Mrunal Thakur | ఈ ఏడాది మృణాళ్ ఠాకూర్‌కు చాలా స్పెషల్.. ఎందుకంటే..?
Read Also :Narappa | మూవీ లవర్స్ గెట్ రెడీ.. థియేటర్లలో వెంకటేశ్ నారప్ప
Read Also :Mukhachitram | విశ్వక్సేన్ ముఖచిత్రం కొత్త అప్డేట్