‘ఈ రోజుల్లో అందంగా కనిపించేందుకు ప్రతి ఒక్కరూ కాస్మోటిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు. అదేం తప్పు కాదు. అయితే.. ఈ విషయంలో మహిళలను మాత్రమే బ్లేమ్ చేయలేం. కాస్మొటిక్ సర్జరీలను ఆశ్రయిస్తున్న పురుషులు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. అంతెందుకు సినీ పరిశ్రమలోనే అలాంటి వాళ్లు కోకొల్లలు.’ అంటూ బాంబ్ పేల్చారు ఒకనాటి బాలీవుడ్ అందాలతార కాజోల్. ఆమె నటించిన ‘సర్ జమీన్’ చిత్రం రీసెంట్గా ఓటీటీలో విడుదలైంది.
ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అందం, గ్లామర్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు కాజోల్. ‘అందం లేనివాళ్లు అందంగా కనిపించాలని కోరుకోవడంలో తప్పేంలేదు. కెమెరా ముందు నటించే అవకాశం ఉన్నప్పుడు, అందం కోసం కొన్ని ప్రయత్నాలు చేయడం సమర్ధనీయమే.
అలాంటి వారిని జడ్జ్ చేయకూడదు.’ అని హితవు పలికారు కాజోల్. వయసు గురించి మాట్లాడుతూ ‘ఈ మధ్య నా వయసు కొందరు సోషల్ మీడియావాళ్లకు సమస్యగా మారింది. నా దృష్టిలో ఏజ్ అనేది ఓ నంబర్ అంతే. జీవించడానికి నాకెన్నో అద్భుతమైన సంవత్సరాలు ఇంకా మిగిలివున్నాయి.’ అంటూ పేర్కొన్నారు కాజోల్.