Rajkummar Rao | బాలీవుడ్ లవ్లీ కపుల్ రాజ్‌కుమార్ రావు, పత్రలేఖ తల్లిదండ్రులయ్యారు. తమ నాల్గో వివాహ వార్షికోత్సవం రోజే ఈ జంట పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వగా, ఈ సంతోషకరమైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు. రాజ్‌కుమార్ రావు – పత్రలేఖ సంయుక్త ప్రకటన చేస్తూ.. దేవుడు మాకు చిన్న దేవదూతను అనుగ్రహించాడు. మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. – ప్రేమతో, రాజ్‌కుమార్ & పత్రలేఖ” . వివాహ వార్షికోత్సవానికే ఈ వరం లభించడం పట్ల వారు ప్రత్యేక క్యాప్షన్ కూడా ఇచ్చారు . మా నాలుగో వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుడు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం ఇది. అంటూ కామెంట్ చేశారు.
ఇక సెలబ్రిటీలు, అభిమానులు ఈ జంటకి శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు. ఈ జంట జూలై 9న తమ పేరెంటింగ్ జర్నీని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో అత్యంత ప్రేమికుల జంటగా గుర్తింపు పొందిన రాజ్‌కుమార్ రావు – పత్రలేఖ చాలాకాలం డేటింగ్ చేశాక 2021 నవంబర్ 15న చండీగఢ్‌లో సింపుల్ & ఎలిగెంట్‌గా వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత వారి కుటుంబంలోకి కొత్త అతిథి చేరడం అభిమానులకు మరింత ఆనందం కలిగిస్తోంది.
ఒక ఇంటర్వ్యూలో పత్రలేఖ మాట్లాడుతూ.. బిడ్డ పుట్టిన తర్వాత సౌత్ న్యూజిలాండ్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాం. ఇది మా బకెట్ లిస్ట్‌లో చాలా కాలంగా ఉంది. అక్కడ బంగీ జంపింగ్ లేదా బిడ్డతో కలిసి ఎంజాయ్ చేసే ఏదైనా రకమైన యాడ్వెంచర్ ప్లాన్ చేస్తాం” అని చెప్పింది. మరి ఈ టూర్ ఎప్పుడు ప్లాన్ చేస్తారో అన్నది చూడాలి. ఇక రాజ్ కుమార్ రావు హీరోగా వరుస సినిమాలు చేస్తుండగా పత్రలేఖ హీరోయిన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ అలరిస్తుంది.