కోవిడ్ ఎఫెక్ట్‌తో అన్ని రంగాలతోపాటు సినీ పరిశ్రమ కూడా అతలాకుతలమైన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌తో ఇక థియేటర్లకు జనాలు రావడం కష్టమే అనుకుంటున్న సమయంలో.. సినిమాల భవితవ్యం విషయంలో ఉన్న డైలామాకు చెక్ పెట్టడంలో తెలుగు సినీ పరిశ్రమ (Tollywood) సక్సెస్ అయిందనే చెప్పాలి. అయితే పెద్ద ఇండస్ట్రీగా పేరున్న బాలీవుడ్ (Bollywood)కు మాత్రం కరోనా తర్వాత కష్టకాలం మొదలైంది.
భూల్ భులయా 2, గంగూభాయ్ కథియావాడి, బ్రహ్మాస్త్ర సినిమాలు తప్ప హిందీ నుంచి భారీ సక్సెస్ అందుకున్న సినిమాలేవీ లేవు. అయితే 2022లో మాత్రం సినిమా థియేటర్లు కోవిడ్ ప్రభావం నుంచి పూర్తిస్థాయిలో ఉపశమనం పొందాయనే చెప్పొచ్చు. ఈ ఏడాది కూడా బాలీవుడ్‌కు చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడం గమనార్హం.
రీసెంట్గా రిలీజైన భారీ ప్రాజెక్ట్ ‘సర్కస్’ (Cirkus). స్టార్ డైరెక్టర్ రోహిత్‌శెట్టి, రణ్వీర్ సింగ్ కాంబినేషన్లో తెరకెక్కింది. కనీసం ఈ మూవీ అయినా 2022 (2022 year) లో హిందీ చిత్ర పరిశ్రమకు చెప్పుకోదగ్గ మంచి బ్రేక్ ఇస్తుందని ఆశించిన సినీ జనాలకు తీవ్ర నిరాశే మిగిల్చింది. బ్లాక్ బస్టర్ చిత్రాలతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన రోహిత్ శెట్టికి హిట్ చిత్రాల దర్శకుడిగా పేరుంది. అయితే ఈ పేరు సర్కస్‌కు ఏ మాత్రం పనిచేయకపోవడం హిందీ మూవీ లవర్స్ ఏ మాత్రం జీర్ణించుకోలేని విషయం.
సర్కస్ ను బీట్ చేసిన ధమాకా..
గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన సర్కస్ ఇండియాలో మూడు రోజుల్లో కేవలం రూ.20.75 కోట్లు మాత్రమే రాబట్టింది. సర్కస్ కు అమెరికాలో వచ్చిన స్పందన కూడా అందరినీ షాక్ కు గురి చేసింది. గోల్డెన్ లెగ్గా పిలుచుకునే పూజాహెగ్డే ఈ మూవీలో మెరిసినా సక్సెస్‌కు అంతగా కలిసి రాలేదు. ఇంకో ఆసక్తికర విషయమేంటంటే సర్కస్ 2022లో పూజాహెగ్డే అందుకున్న ఫెయిల్యూర్లలో నాలుగోది కావడం. యూఎస్‌లో రవితేజ నటించిన ‘ధమాకా’ ఓపెనింగ్ వీకెండ్లో రూ.1,55,74,521 రాబట్టింది. అయితే సర్కస్ మాత్రం రూ. 1,49,11,416 మాత్రమే వసూలు చేసింది.
అంటే హిందీ భారీ ప్రాజెక్ట్ సర్కస్ తెలుగు సినిమా ధమాకాను కూడా అందుకోలేకపోయిందంటే బాలీవుడ్‌కు 2022 ఎలాంటి ఛేదు అనుభవాన్ని మిగిల్చిందో అర్థమవుతుంది. ఏదేమైనా 2022 ఇయర్ రోహిత్‌శెట్టి, రణ్‌వీర్‌సింగ్, పూజాహెగ్డేతోపాటు హిందీ ఇండస్ట్రీకి కూడా పెద్ద షాకిచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి 2023లోనైనా బాలీవుడ్‌కు మంచి రోజులు రావాలని కోరుకుంటున్నారు సినీ జనాలు.
2023 ప్రారంభంలో బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్ నటిస్తోన్న పఠాన్ విడుదల కానుంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా అయినా బాలీవుడ్‌కు 2023లో శుభారంభాన్ని ఇస్తుందా..? అనేది చూడాలి. అలాగే సల్మాన్ ఖాన్ నటిస్తోన్న కిసీ కా భాయ్ కిసీ కీ జాన్‌తో పాటు పలు చిత్రాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.